Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహాభారతాన్ని ఎనిమిదేళ్ల తర్వాత తీస్తా.. నాలో సెల్ఫ్ డౌట్ ఉంది: రాజమౌళి

మహాభారతం తీయడమే తన కల అంటూ గతంలో చెప్పుకొచ్చిన బాహుబలి మేకర్ రాజమౌళి.. మహాభారతాన్ని తెరకెక్కించే విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు సమాచారం. మహాభారతం తీయాలంటే సాంకేతికంగా అన్ని విధాలా హ్యాండిల్ చేయగలనా

మహాభారతాన్ని ఎనిమిదేళ్ల తర్వాత తీస్తా..  నాలో సెల్ఫ్ డౌట్ ఉంది: రాజమౌళి
, సోమవారం, 5 జూన్ 2017 (12:36 IST)
మహాభారతం తీయడమే తన కల అంటూ గతంలో చెప్పుకొచ్చిన బాహుబలి మేకర్ రాజమౌళి.. మహాభారతాన్ని తెరకెక్కించే విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు సమాచారం. మహాభారతం తీయాలంటే సాంకేతికంగా అన్ని విధాలా హ్యాండిల్ చేయగలనా అనే భయం తనకు వుందని ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పారు.

మహాభారతం తీయాలనే తపన ఉన్నా అందుకు తన అనుభవం చాలదని, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని రాజమౌళి చెప్పుకొచ్చారు. మహాభారతాన్ని తెరకెక్కించడం పెద్ద ఛాలెంజ్ అని అంటున్నారు.
 
మహాభారతం తీయాలంటే సమయంలో కావాలి. ఇంకా అంత పెద్ద ప్రాజెక్టు తీసే సత్తా తనలో ఉందా అనే సెల్ఫ్ డౌట్‌లో తనలో ఉందన్నారు. అయితే కచ్చితంగా ఎనిమిదేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ చేస్తానని రాజమౌళి అనడంతో దీనిపై మరో సారి ఆసక్తికర చర్చ నడుస్తుంది.
 
ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన రందమూళమ్ పుస్తకం ఆధారంగా కొత్త సినిమా రూపొందనుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మహాభారత్ ప్రాజెక్టును వీఏ శ్రీకుమార్ మీనన్‌ దర్శకత్వంలో నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భీముని పాత్రధారిగా మోహన్ లాల్ కనిపించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్‌-భారతీ రాజాలకు చురకలంటించిన సముద్రకని? రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు