Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

"మీరు నా చెంత ఉన్నంతవరకు నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా" : బాహుబలి-2 టీజర్ (Video)

ఎపుడెపుడా అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న "బాహుబలి-2" టీజర్ గురువారం ఉదయం రిలీజ్ అయింది. ప్రభాస్ - రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్‌లు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి ఎస్ఎస్.రాజమౌళి

Advertiesment
Baahubali 2 - The Conclusion Trailer Release
, గురువారం, 16 మార్చి 2017 (09:09 IST)
ఎపుడెపుడా అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న "బాహుబలి-2" టీజర్ గురువారం ఉదయం రిలీజ్ అయింది. ప్రభాస్ - రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్‌లు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ గురువారం విడుదల చేశారు. 
 
ఇందులో ప్రభాస్ డైలాగులు అద్భుతంగా ఉన్నాయి... "అమరేంద్ర బాహుబలి అనే నేను.. మహిష్మతి రాజ ప్రజల చరస్థిర ఆస్తులతో పాటు మానప్రాణాలను రక్షించేందుకు ప్రాణత్యాగం చేసేందుకు వెనుకంజ వేయను, ఇది రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా" అంటూ ప్రమాణం చేస్తున్నారు. అంతేకాకుండా, "మీరు నా చెంత ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంతవరకు పట్టలేదు మామా" అంటూ సాగే ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువు తగ్గిన జూనియర్ ఎన్టీఆర్