'ఊహించనిది జరిగింది.. రూ.1000 కోట్లు.. ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది': ప్రిన్స్ మహేష్
"బాహుబలి 2" చిత్ర ప్రభంజనపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం విడుదలైన పది రోజుల్లోనే రోజుకు రూ.100 కోట్ల చొప్పున ఏకంగా రూ.1000 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్రను స
"బాహుబలి 2" చిత్ర ప్రభంజనపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం విడుదలైన పది రోజుల్లోనే రోజుకు రూ.100 కోట్ల చొప్పున ఏకంగా రూ.1000 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్రను సృష్టించింది. పైగా, ఈ తరహా కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా బాహుబలి రికార్డు పుటలకెక్కింది.
దీంతో అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు వివిధ రకాలుగా ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్ల వర్షం గుప్పిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా మహేష్ బాబు మరోమారు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఊహించనిది జరిగింది. రూ.1000 కోట్లు. ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. నాతో పాటు మొత్తం తెలుగు సినీ రంగం గర్వించేలా చేసిన దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి, యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశాడు.