Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కట్టప్ప సారీ చెప్పారు... మనసు నొచ్చుకునివుంటే క్షమించండి... బాహుబలి రిలీజ్‌కు అడ్డంకులు తొలగినట్టేనా?

కన్నడ ప్రజలకు కట్టప్ప ఎట్టకేలకు సారీ చెప్పారు. దీంతో తాను కీలక పాత్ర పోషించిన 'బాహుబలి-2' చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. నిజానికి ఈనెల 28వ తేదీన 'బహుబలి-2' విడుదల కానుంద

Advertiesment
కట్టప్ప సారీ చెప్పారు... మనసు నొచ్చుకునివుంటే క్షమించండి... బాహుబలి రిలీజ్‌కు అడ్డంకులు తొలగినట్టేనా?
, శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (16:17 IST)
కన్నడ ప్రజలకు కట్టప్ప ఎట్టకేలకు సారీ చెప్పారు. దీంతో తాను కీలక పాత్ర పోషించిన 'బాహుబలి-2' చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. నిజానికి ఈనెల 28వ తేదీన 'బహుబలి-2' విడుదల కానుంది. కన్నడంలో మాత్రం ఈ చిత్రం విడుదలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో చిత్ర దర్శకుడు రాజమౌళి రంగంలోకి దిగి కన్నడంలో మాట్లాడుతూ కన్నడ ప్రజలను శాంతపరిచేందుకు ప్రయత్నించారు. 
 
'బాహుబలి-2 ది కన్ క్లూజన్' సినిమా విడుదలను అడ్డుకోవడం సరికాదని, సత్యరాజ్ ఈ సినిమా దర్శకుడు, నిర్మాత కానీ కాదని, కేవలం ఒక నటుడు మాత్రమేనని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, కన్నడ ప్రజలు మాత్రం శాంతించలేదు. సత్యరాజ్ క్షమాపణలు చెప్పేవరకు 'బాహుబలి 2' సినిమా విడుదలకు కన్నడనాట సహకరించమని కన్నడ ధళవళ పార్టీ నాయకుడు వాటాళ్ నాగరాజు తేల్చిచెప్పారు. 
 
తమ పోరాటం 'బాహుబలి' సినిమాపై కాదని, తమ పోరాటం సత్యరాజ్ మీద అని, కన్నడిగులను అపహాస్యం చేసిన సత్యరాజ్ నటించిన సినిమాలు కన్నడంలో విడుదల జరగదని హెచ్చరించారు. పైగా, రాజమౌళి కన్నడలో మాట్లాడినంత మాత్రాన సరిపోదని, సత్యరాజ్‌తో క్షమాపణలు చెప్పించాలని సూచించారు. ఈ విషయంలో సాక్షాత్తూ బ్రహ్మదేవుడే వచ్చినా తమ నిర్ణయం మారదని స్పష్టం చేశారు. దీంతో కట్టప్ప సత్యరాజ్ దిగిరాక తప్పలేదు. 
 
"తాను కన్నడ ప్రజలకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని కుండబద్దలు కొట్టే ప్రకటన చేసారు. అలాగే తన వల్ల 'బాహుబలి' వంటి గొప్ప చిత్రానికి ఇబ్బందులు రావడం ఇష్టం లేదని, ఈ సినిమా ప్రతి ఒక్కరి దరికీ చేరాల్సి ఉందని అన్నారు. కన్నడ ప్రజలంతే తనకెంతో గౌరవం ఉందని, గతంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లుగా" సత్యరాజ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఇక్కడితోనైనా ఈ వివాదానికి ఓ 'ఎండింగ్' పడుతుందేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి టీం పొట్ట కొట్టొద్దు... సారీ చెప్పిన కట్టప్ప...