Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ హీరో కొడుకు అపుడే 'దండాలెట్టడం మొదలెట్టేశాడు'... ఎవరు? ఎక్కడ?

సాధారణంగా రాజకీయ నేతలైనా, సినీ స్టార్స్ అయినా వేదికలపైకి వచ్చాక పార్టీ కార్యకర్తలు లేదా అభిమానులకు చేతులెత్తి నమస్కరించడం చేస్తుంటారు. సినీస్టార్స్ అయితే, ఫ్లైయింగ్ కిస్సులు కూడా ఇస్తుంటారు. అభిమానులక

Advertiesment
DJ - Duvvada Jagannadham Audio Launch
, సోమవారం, 12 జూన్ 2017 (12:46 IST)
సాధారణంగా రాజకీయ నేతలైనా, సినీ స్టార్స్ అయినా వేదికలపైకి వచ్చాక పార్టీ కార్యకర్తలు లేదా అభిమానులకు చేతులెత్తి నమస్కరించడం చేస్తుంటారు. సినీస్టార్స్ అయితే, ఫ్లైయింగ్ కిస్సులు కూడా ఇస్తుంటారు. అభిమానులకు అభివాదం చేయడం సంస్కారం కూడా. అయితే, వేలెడంత లేని ఓ హీరో కుమారుడు.. వేదికపై రాగానే రెండు చేతులెత్తి దండం పెట్టడం ఆహుతులను, చూపరులను విస్మయానికి గురి చేసింది. ఇంతకీ ఆ హీరో కొడుకు ఎవరన్నదే కదా మీ సందేహం. ఇంకెవరో కాదు.. అల్లు అర్జున్. 
 
'గంగోత్రి'తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. 'బన్నీ'గా తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించిన అల్లు అర్జున్ త్వరలో తన తాజా సినిమా ‘డీజే- దువ్వాడ జగన్నాథం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి బన్నీ తన కుటుంబ సమేతంగా వచ్చాడు. తన భార్య స్నేహతో పాటు కుమారుడ్ అయాన్, కుమార్తె అర్హను కూడా తీసుకొచ్చాడు.
 
ఈ ఆడియో వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సినిమా పాటలను బన్నీ కొడుకు అయాన్, దిల్‌రాజు మనవడు ఆరాన్ష్ కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా స్టేజి పైకి వెళ్లిన అయాన్.. ఓ రాజకీయ నాయకుడు తన కార్యకర్తలకు.. ఓ హీరో తన అభిమానులకు ఏ విధంగా అభివాదం చేస్తాడో.. ఆ రేంజ్‌లో చేతులు పైకెత్తి ఫోజిచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసి బన్నీ విస్మయం వ్యక్తం చేయగా.. పక్కనే ఉన్న అల్లు అరవింద్ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తన కొడుకు ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తున్న ఫొటోను బన్నీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి కాదు దాని అమ్మమ్మ లాంటి సినిమా.. 3 రోజుల్లో రూ.1435 కోట్లు, వారంలో రూ.2,700 కోట్లు