Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాత్రిళ్లు భార్యాభర్తలు ఏం చేస్తారు? BBBపై అవసరాల అవస్తలు

అవసరాల శ్రీనివాస్ అవస్త మామూలుగా లేదు. బాబు బాగా బిజీ చిత్రంలో అడల్ట్ కామెడీ ఆరోగ్యకరమైనదే అని చెప్పుకునేందుకు... రాత్రిళ్లు భార్యాభర్తలు ఏం చేస్తారు... పిల్లలు ఎలా పుడతారు... గట్రా క్వచ్చన్స్ లేపుతున్నారు. ఇది అందరికీ తెలిసినా, రహస్యాలు రహస్యంగానే చ

Advertiesment
avasarala reacts on BBB
, శుక్రవారం, 5 మే 2017 (21:22 IST)
అవసరాల శ్రీనివాస్ అవస్త మామూలుగా లేదు. బాబు బాగా బిజీ చిత్రంలో అడల్ట్ కామెడీ ఆరోగ్యకరమైనదే అని చెప్పుకునేందుకు... రాత్రిళ్లు భార్యాభర్తలు ఏం చేస్తారు... పిల్లలు ఎలా పుడతారు... గట్రా క్వచ్చన్స్ లేపుతున్నారు. ఇది అందరికీ తెలిసినా, రహస్యాలు రహస్యంగానే చూపితే బావుంటుంది కదా. ఇదివరకు రొమాంటిక్ సన్నివేశాలు రాగానే రెండు రామచిలుకలనో, రెండు పావురాళ్లనో లేదంటే ద్రాక్ష గుత్తి జారిపడటమో వంటి సీన్లు లాగించేసేవారు. కానీ బాబు బాగా బిజీలో వ్యవహారం ఎలా వున్నా అవసరాల సర్దుకోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 
హిందీ చిత్రం 'హంటర్'. తెలుగులో 'బాబు బాగా బిజీ' పేరుతో శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించగా దర్శకుడు మేడారం నవీన్ తెరకెక్కించారు. ఇందులో ఘాటైన మసాలా సీన్లు ఉన్నాయి. అందుకే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకునేందుకు అష్టకష్టాలు పడింది. 
 
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అవసరాల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌‌గా మారాయి. ఈ సినిమాలో నిజ జీవితంలో జరిగే విషయాలనే చూపించాం. దీన్ని బూతు సినిమాగా భావించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడాల్సిన అవసరం లేదని అవసరాల అంటున్నారు. 
 
పైగా, ఈ సినిమా చూసి యూత్ చెడిపోరా అని అడిగితే అలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ సినిమాలో కౌంటెంత అని అడిగితే 100 అని చెబుతాను... అలా అని నిజ జీవితంతో వందమందితో తిరిగినట్లు కాదు కదా అని కౌంటర్ ఇచ్చాడు. సినిమాల్లో హీరో 50 మందిని హత్య చేస్తాడు. అలా నిజ జీవితంలో జరగదు కదా అని ప్రశ్నించాడు. 
 
సినిమాను ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా మాత్రమే భావించాలని, నిజ జీవితాలకు ఆపాదించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఈ సినిమాలో మసాలా సీన్లు ఉన్న మాట వాస్తవమేనని... అయినా అలాంటి సీన్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నించాడు. రియల్ లైఫ్‌లో చేస్తున్నదే కదా అని అవసరాల శ్రీనివాస్ ఘాటుగా రియాక్టయ్యాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందాల హీరో అరవింద్ స్వామితో శ్రియ రొమాన్స్..? నెగటివ్ రోల్ చేస్తుందట..?