సినిమా టైటిల్ : సోగ్గాడే చిన్ని నాయనా
తారాగణం : నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, సంపత్, నాజర్, బ్రహ్మనందం తదితరులు
సంగీతం : అనూప్ రుబెన్స్
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత : నాగార్జున
సోగ్గాడే చిన్ని నాయనా సినిమా రివ్యూ రిపోర్ట్.. నాగార్జున ఫ్యాన్స్‌కు ఫర్‌ఫెక్ట్ గిఫ్ట్ అని టాక్ వచ్చింది. ఫాంటసీ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. టాలీవుడ్‌లో ప్రస్తుతం సక్సెస్ ఫార్ములాగా ఉన్న ఆత్మలు తిరిగి రావటం అనే కాన్సెప్ట్కు కామెడీ జోడించి నాగార్జున చేసిన ప్రయోగం కొంతవరకు సక్సెస్ అయ్యిందనే టాక్ వస్తోంది. ఫ్యామిలీ, డ్రామా, కామెడీ వంటి అంశాలు మిళితమైన సోగ్గాడే చిన్నినాయనా ఓవరాల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే మంచి ఫ్యాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందనే చెప్పాలి.
కథ పరంగా వస్తే..
రాము (నాగార్జున) అమాయకుడైన డాక్టర్. తన పనిని మినహాయించి భార్య సీత(లావణ్య త్రిపాఠి) పెద్ద అస్సలు పట్టించుకోడు. దీంతో రాము నుంచి సీత విడిపోవాలనుకుంటుంది. ఆ విషయాన్ని అత్తగారైన రమ్య కృష్ణ (సత్తమ్మ)తో చెప్తుంది. కళ్ల ముందే కొడుకు కాపురం పాడవటం చూడలేని సత్తమ్మ 30 సంవత్సరాల క్రితం మరణించిన తన భర్త బంగార్రాజు ( నాగార్జున)ను గుర్తు చేసుకుంటుంది.
ఈ క్రమంలో నరకంలో అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న బంగార్రాజు భార్యకు సాయం చేసేందుకు యముడి పర్మిషన్‌తో భూలోకానికి వస్తాడు. కొడుకు కాపురం సరిద్దిదే సమయంలో తన చావు యాక్సిండెంట్ కాదని, హత్య అని తెలుసుకుంటాడు. అంతేకాదు అదే సమయంలో తన కొడుకుతో సహా తన కుటుంబం అంతా ప్రమాదంలో ఉందని తెలిసి వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఇక బంగార్రాజును ఎవరు చంపారు? ఎందుకు చంపారు.. వారి బారి నుండి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
పెర్‌ఫార్మెన్స్ :
అమాయకుడైన రాముగా, సరదాగా కనిపించే బంగార్రాజుగా రెండే షేడ్స్‌లో నాగార్జున అదరగొట్టేశాడు. బంగార్రాజు లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నాగ్, ఆ పాత్రతో ఏఎన్నార్ను గుర్తు చేశాడు. చాలా కాలం తరువాత నాగ్తో కలిసి నటించిన రమ్యకృష్ణ, గ్లామర్ విషయంలో ఈ జనరేషన్ హీరోయిన్లకు పోటీ ఇచ్చింది. లావణ్యత్రిపాఠి క్యూట్ లుక్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బ్రహ్మానందం ఈ సినిమా ద్వారా కాస్త గ్యాప్ ఇచ్చిన తన కామెడీని పండించుకున్నాడు. ఈ సినిమాలో ఆత్మలతో మాట్లాడే బాబాగా బాగానే నవ్వించాడు. నాజర్, సంపత్, పోసాని కృష్ణ మురళిలు తమ పాత్రలకు సరిగ్గా ఒదిగిపోయారు. హంసనందిని, అనసూయల గ్లామర్ సినిమాకు హైలైట్. అనుష్క గెస్ట్ అప్పీయరెన్స్ ఆడియన్స్కు షాక్ ఇచ్చింది.
ప్లస్ పాయింట్స్ :
నాగార్జున, రమ్యకృష్ణ యాక్టింగ్
సెకండాఫ్ కామెడీ అదరిపోయింది.
నేపథ్యం సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది.
మైనస్ పాయింట్స్ :
స్ట్రాంగ్ విలనిజం కరువవడం
రొటీన్ టేకింగ్
రేటింగ్ పాయింట్స్: 3.5