Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళ తంబీల దెబ్బకు దారికొచ్చిన త్రిష... 'జల్లికట్టు'కు నేను కూడా 'సై'

పదిమంది నడిచిన దారిలోనే మనం కూడా నడవాలి. అది ఎలాంటిదైనాసరే. ఊరందరిదీ ఒకదారి ఉలిపిరికట్టది మరో దారి అంటే వ్యవహారం త్రిషకు జరిగినట్లే వుంటుంది. అందువల్లనో ఏమోగానీ త్రిష జల్లికట్టుపై రివర్స్ అయ్యింది. అంతకుముందు జల్లికట్టును నిషేధానికి పాటుపడిన త్రిష పూ

Advertiesment
తమిళ తంబీల దెబ్బకు దారికొచ్చిన త్రిష... 'జల్లికట్టు'కు నేను కూడా 'సై'
, శుక్రవారం, 20 జనవరి 2017 (16:41 IST)
పదిమంది నడిచిన దారిలోనే మనం కూడా నడవాలి. అది ఎలాంటిదైనాసరే. ఊరందరిదీ ఒకదారి ఉలిపిరికట్టది మరో దారి అంటే వ్యవహారం త్రిషకు జరిగినట్లే వుంటుంది. అందువల్లనో ఏమోగానీ త్రిష జల్లికట్టుపై రివర్స్ అయ్యింది. అంతకుముందు జల్లికట్టును నిషేధానికి పాటుపడిన త్రిష పూర్తిగా రివర్స్ అయి తను జల్లికట్టుకు మద్దతిస్తున్నట్లు నడిగర్ సంఘంతో కలిసి స్టేజిపైన ప్రకటించింది. తనకు మూగజీవాలపై ప్రేమ ఉన్నదనీ, ఐతే తమిళ సంప్రదాయాలను కూడా గౌరవిస్తానంటూ గొంతు సవరించుకుంది.
 
కాగా త్రిష గతంలో జల్లికట్టును నిషేధించాల్సిందేనంటూ ట్విట్టర్లో పోస్టులు చేసింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. అభ్యంతరకర పోస్టులు చేశారు. దుర్భాషలాడారు. దీనితో తట్టుకోలేని త్రిష తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేసింది. ఐతే తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి అసభ్య సందేశాలను పెట్టారనీ, అందువల్లనే అలాంటి వ్యాఖ్యలు తన ట్విట్టర్ ఖాతాలో కనిపించాయనీ, ప్రస్తుతం దాన్ని డీ-యాక్టివేట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నదిలో రోజంతా బయటికి రాకుండా ఈత కొడుతుంటే.. కారణం ఏమిటి?