Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హన్సికను ఐదు నిమిషాలే చూపెట్టారు... అమేజాన్ ప్రైమ్‌లో..?

హన్సికను ఐదు నిమిషాలే చూపెట్టారు... అమేజాన్ ప్రైమ్‌లో..?
, గురువారం, 30 జనవరి 2020 (14:10 IST)
శామ్ ఆంటన్ అనే దర్శకుడు 100 అనే సినిమాను రూపొందిస్తున్నాడు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అధర్వ, హన్సికలు నటిస్తున్నారు. అయితే హన్సిక రోల్ నిడివి ఈ సినిమాలో చాలా తక్కువ. రెండంటే రెండే సీన్లు. నిండా ఐదు నిమిషాలు మాత్రమే. అయితే ఇంత ఘోరంగా హీరోయిన్‌ను ఐదు నిమిషాలు మాత్రమే చూపించే తొలి సినిమా ఇదే అయి వుంటుంది. 
 
గద్దలకొండ గణేష్ సినిమాలో అభిలాష్ పాత్రలో కనిపించే అధర్వ ఈ చిత్రంలో కంట్రోల్ రూమ్‌లో పనిచేసే వ్యక్తిగా కనిపిస్తాడు. సూపర్ కాప్ అవుతానని కలలు గన్న ఓ పోలీస్ ట్రైనీని తీసుకుపోయి కంట్రోల్ రూం విధుల్లో వేస్తారు. ఆ 100కు వచ్చే కాల్స్ ఆధారంగా హీరో ఓ పెద్ద మహిళ క్రయవిక్రయాల నెట్‌వర్కును చేధిస్తాడు. అందుకే ఈ సినిమాకు 100 అనే టైటిల్ ఖరారు చేశారు. 
 
మొదట్లో నెగెటివ్ రివ్యూలతో ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. తరువాత మౌత్ పబ్లిసిటీతో పికపయి, ఏకంగా 50 రోజులు థియేటర్లలో నడిచింది. ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్‌లో ఉంది. ఈ చిత్రం తమిళ వెర్షనే కానీ తెలుగు ఆడియో వుంది. ఎంచక్కా డబ్బింగు సినిమా చూస్తున్నట్టుగా చూసేయొచ్చు. స్ట్రెయిట్ తెలుగు సినిమాలాగే అనిపిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా పెదాలను దాటి నాలుకను చప్పరించాడు... షూటింగ్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్