Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 4న అథ‌ర్వా డస్టర్ 1212 విడుదల

Advertiesment
మార్చి 4న  అథ‌ర్వా  డస్టర్ 1212  విడుదల
, గురువారం, 17 ఫిబ్రవరి 2022 (16:50 IST)
Maripi Vidyasagar,Vallabhaneni Anil,Kadambari Kiran, Visinagiri Srinivasa Rao
హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రమే "డ‌స్ట‌ర్‌ 1212". శుభ‌కరి క్రియేష‌న్స్,వి.యస్.ఆర్ మూవీస్ బ్యానర్స్ పై అథ‌ర్వా (వాల్మికీ ఫేమ్), మిష్టి, అనైకాసోటి నటీనటులుగా బ‌ద్రీ వెంక‌టేష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రిపి విద్యాసాగ‌ర్‌(విన‌య్‌), విసినిగిరి శ్రీనివాస రావులు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం "డ‌స్ట‌ర్‌ 1212" .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కు సిద్ధమైన  సంద‌ర్భంగా. చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సినీ అతిరదుల సమక్షంలో చిత్ర ట్రైలర్ ను ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్, నిర్మాత యమ్. సూర్య నారాయణ రెడ్డి,దర్శకుడు శ్రీకాంత్, నటుడు కాదంబరి కిరణ్  తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో
 
ముఖ్య అతిథిగా వచ్చిన చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. చిన్న సినిమా పెద్ద సినిమా ఆనే తేడా లేకుండా ఒక సినిమా తయారుకావడానికి 24 న కార్మిక సంఘాలు ఎంతో కష్టపడతాయి. ఎంతో కష్టపడి విడుదల చేసిన ప్రతి సినిమా ఆడాలని కోరుతున్నాను. ముఖ్యంగా మార్చి 4న థియేటర్స్ లలో విడుదల అవుతున్న ''డస్టర్ 1212"  పెద్ద సక్సెస్ కావాలని కోరుతున్నాను అన్నారు
 
నటుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.."డస్టర్ 1212" సినిమా ఇండస్ట్రీ కి బిగ్ హిట్ కావాలి.చిన్న సినిమా మేకింగ్ లో చిన్నది అవ్వచ్చు కానీ కలెక్షన్ లో గాని హిట్ లో గాని పెద్ద స్థానం ఉంటుంది. అలాంటి స్థానం చిన్న సినిమాకు రావాలంటే  భుజానికి వేసుకుని చేయాల్సిన బాధ్యత మీడియాదే. శుభకరి క్రియేషన్స్, వి.యస్.ఆర్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన "డస్టర్ 1212" చిత్ర యూనిట్ కు ఈ సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు
చిత్ర నిర్మాత విసనగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మా ట్రైలర్ కు విడుదల చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.  సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం ఉన్న ఈ కథ నచ్చడంతో మేము వినయ్ గారితో కలిసి "డస్టర్ 1212" సినిమా తీశాము. సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీ అందరూ కలసి చూసే విధంగా ఈచిత్రాన్ని తెరకెక్కించాము. ఇందులోని పాటలు చాలా వగా వచ్చాయి.ఈ సినిమా హిట్ అయితే మరిన్ని సినిమాలు చేయడానికి ముందుకు వస్తాము. ప్రేక్షకులందరూ  మమ్మల్ని, మా సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా  కోరుతున్నాను అన్నారు.
 
చిత్ర నిర్మాత మరిపి విద్యాసాగ‌ర్‌ (విన‌య్‌) మాట్లాడుతూ.. "డస్టర్ 1212" ట్రైలర్ విడుదల చేయడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన చిత్రమిది. త‌మిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు నెటివిటీకి అనుకూలంగా మార్పులు చేయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది.మార్చి 4 న గ్రాండ్ గా విడుదల చేస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.
 
గౌరవ అతిథి త్రినాథరావు మాట్లాడుతూ..ఇంతకుముందు చిత్రపరిశ్రమ ఒక వెలుగు వెలిగింది ఈ కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకు కళ వస్తుంది.ఇప్పుడు వస్తున్న  సినిమాల వలన ఎంతో మంది కార్మికులను ఊపిరి పీల్చు కుంటున్నారు.ఈ "డస్టర్ 1212" సినిమా చూశాను.చాలా బాగుంది. మిస్టర్ ప్రేమికుడు సినిమా తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ  సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు
 
అతిధిగా వచ్చిన నిర్మాత యం. సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..డైరెక్టర్లు అందరూ కూడా సమాజానికి పనికివచ్చే సినిమాలు తీసి నిర్మాతలను బతికించాలి.ఒక ప్రొడ్యూసర్ బతికితే మరిన్ని సినిమాలు తీసి కొన్ని వేల మంది ఆర్టిస్టులకు ఉపాధి కల్పిస్తాడు. కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయి దర్శక,నిర్మాతలకు మంచి పేరు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
అతిథిగా వచ్చిన దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ..శుభకరీ క్రియేషన్స్, వి.యస్.ఆర్ మూవీస్ నిర్మించిన యూత్ ఫుల్ సినిమా "డస్టర్ 1212" ట్రైలర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నాను. మార్చి 4న విడుదల అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని  కోరుతున్నాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్గానిక్ కథలు, కంటెంట్ సినిమాలు చేయాలనుకుంటున్నా: శివ కందుకూరి