Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా ప్లాన్ చేస్తోన్న అశ్వ‌నీద‌త్..!

వైజ‌యంతీ మూవీస్ ఎలాంటి భారీ చిత్రాల‌ను అందించిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అగ్ర హీరోలంద‌రితో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించి ఇండ‌స్ట్రీలో ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాంటి నిర్మాణ సంస్థ ఇటీవ‌ల కాలంలో బాగా వెన‌క‌బ‌డింది. ఇలాం

Advertiesment
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా ప్లాన్ చేస్తోన్న అశ్వ‌నీద‌త్..!
, మంగళవారం, 15 మే 2018 (19:28 IST)
వైజ‌యంతీ మూవీస్ ఎలాంటి భారీ చిత్రాల‌ను అందించిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అగ్ర హీరోలంద‌రితో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించి ఇండ‌స్ట్రీలో ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాంటి నిర్మాణ సంస్థ ఇటీవ‌ల కాలంలో బాగా వెన‌క‌బ‌డింది. ఇలాంటి టైమ్‌లో ఈ సంస్థ నిర్మించిన మ‌హాన‌టి చిత్రం సంచ‌ల‌న విజయం సాధించింది. దీంతో ఈ సంస్థ‌కు పూర్వవైభ‌వాన్ని తెచ్చి పెట్టింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.
 
ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో అశ్వనీదత్ మాట్లాడుతూ.. ఇకపై తమ బ్యానర్లో వరుస సినిమాలు నిర్మిస్తామని చెప్పారు. ప్రస్తుతం నాగార్జున- నాని కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ మూవీ నిర్మిస్తున్నాం. ఆ త‌ర్వాత మ‌హ‌ష్ బాబుతో ఒక సినిమాను నిర్మించ‌నున్నాం. ఇది జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఆ తరువాత ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయనున్నామని అన్నారు.
 
ఈ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదనీ, త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. గతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఎన్టీఆర్‌తో నిర్మించిన కంత్రి, శ‌క్తి చిత్రాలు ఆక‌ట్టుకోలేక‌పోయాయి. మ‌రి.. ఈసారి ఎన్టీఆర్‌తో స‌క్స‌స్‌ఫుల్ మూవీ తీస్తార‌ని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై 'బట్ట బాబ్జీ'గాడు బాగా వాడేసుకున్నాడు... శ్రీరెడ్డి