Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యాస్టింగ్ కౌచ్ నిజమే.. అయినా నా కుమార్తెను ఆపను.. హీరో అర్జున్

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై యాక్షన్ కింగ్‌ అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమేనని తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. తన కుమార్తె సినిమాల్లో నటించకుండా

Advertiesment
క్యాస్టింగ్ కౌచ్ నిజమే.. అయినా నా కుమార్తెను ఆపను.. హీరో అర్జున్
, మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:23 IST)
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై యాక్షన్ కింగ్‌ అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమేనని తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. తన కుమార్తె సినిమాల్లో నటించకుండా ఆపలేనని తెగేసి చెప్పారు. 
 
గత కొన్ని రోజులుగా క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లలో విపరీతమైన చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, టాలీవుడ్‌లో ఈ చర్చ మరింతగా ఉంది. నటి శ్రీరెడ్డి పెదవి విప్పడంతో ఈ వ్యవహారం రచ్చరచ్చ అయింది.
 
ఈ నేపథ్యంలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా క్యాస్టింగ్ కౌచ్‌ ఉన్నమాట నిజమేనని చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది నూటికి నూరు శాతం నిజమని చెప్పారు. 
 
అయితే దాన్ని దృష్టిలో ఉంచుకుని తన కూతురు ఐశ్వర్యను సినిమాల్లో నటించకుండా ఆపలేనని ఆయన అన్నారు. తన కూతురుపై తనకున్న నమ్మకమే దానికి కారణమన్నారు. ఆ నమ్మకంతోనే ఐశ్వర్యకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించానని తెలిపారు. 38 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న తానే సినీ రంగాన్ని నమ్మకపోతే, మరెవరు నమ్ముతారని అర్జున్ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రణ్‌బీర్‌తో వివాహం.. పెళ్లికి తర్వాత అలియాభట్ సినిమాల్లో కనిపిస్తుందా?