Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరవింద్ స్వామి రీ ఎంట్రీ.. సెల్వ సినిమాలో హీరోగా.. ఐదుగురు అమ్మాయిలతో రొమాన్స్

అరవింద్ స్వామి రీ ఎంట్రీ అదిరిపోతోంది. కడలి, తని ఒరువన్ వంటి సినిమాల్లో వెరైటీ రోల్స్ పోషిస్తూ వచ్చిన అరవింద్ స్వామి.. హీరోగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే త్రిషతో జోడీ కట్టిన అరవింద్ స్వామి.. తాజాగా సెల్

Advertiesment
Aravind Swamy To Play The Hero In A New Film?
, సోమవారం, 21 నవంబరు 2016 (11:59 IST)
అరవింద్ స్వామి రీ ఎంట్రీ అదిరిపోతోంది. కడలి, తని ఒరువన్ వంటి సినిమాల్లో వెరైటీ రోల్స్ పోషిస్తూ వచ్చిన అరవింద్ స్వామి.. హీరోగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే త్రిషతో జోడీ కట్టిన అరవింద్ స్వామి.. తాజాగా సెల్వ దర్శకత్వంలో మరో సినిమాలో హీరోగా కనిపించేందుకు సంతకాలు చేసేశారు. క్రైం కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ డిసెంబరు 16వ తేదీన చెన్నైలో ప్రారంభం కానుంది. 
 
ఇప్పటికే తలైవాసల్‌, అమరావతి, కర్ణా, నాన్‌ అవనిల్లై వంటి సుమారు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు సెల్వ. ఈ సినిమాను నాన్ అవనిల్లై బాణీలో ఐదుగురు హీరోయిన్లతో రూపొందిస్తున్నారు. ఇందులో ఓ పాత్రకు ఇనియా ఎంపికైపోయింది. అయిదుగురు ముద్దుగుమ్మల్లో అరవింద్‌ స్వామికి జోడీగా ఎవరు నటిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. కథ మాత్రం వైవిధ్యంగా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మెతుకూ మెతుకూ కూడబెట్టి ముద్ద పోగేస్తే దొంగకూడంటున్నారన్నా'.. నోట్ల రద్దుపై పవన్ కళ్యాణ్ ట్వీట్