Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"రాజధాని ఫైల్స్" విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

rajadhani files

ఠాగూర్

, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (11:58 IST)
"రాజధాని ఫైల్స్" చిత్రం విడుదలకు ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. ఈ చిత్రం విడుదలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికేట్లను పరిశీలించిన తర్వాతే సర్టిఫికేట్లు జారీ చేసిందని స్పష్టం చేసిందని న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
సీఎం జగన్, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని, గత యేడాది డిసెంబరు 18వ తేదీన సీబీఎఫ్సీ జారీ చేసిన ధృవపత్రాన్ని రద్దు చేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 13వ తేదీన విచారణ జరిపిన కోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ గురువారం మధ్యంతరం ఉత్తర్వులిచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది. 
 
కోటాలో దారుణం... 16 యేళ్ల బాలికపై నలుగురు నీట్ విద్యార్థుల అత్యాచారం
 
రాజస్థాన్ రాష్ట్రలోని కోటాలో దారుణం జరిగింది. కోటాలో నీట్ ప్రవేశ పరీక్ష కోసం శిక్షణ తీసుకుంటున్న 16 యేళ్ల బాలికపై నీట్ కోచింగ్ తీసుకుంటున్న నలుగురు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికను తమ గదికి రప్పించిన ఓ విద్యార్థి.. మరో ముగ్గురు విద్యార్థుల సాయంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీతో పాటు పోక్సో చట్టం నిందితులపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. 
 
కోటాలో ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఓ బాలిక రెండు మూడు రోజులుగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతుందని గమనించిన ఆమె స్నేహితురాళ్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమలో అధికారుల ఆ బాలికకు కౌన్సిలింగ్ ఇవ్వగా, బానిక తనకు జరిగిన దారుణాన్ని అధికారులకు చెప్పింది. కోటాలో చదువుకుంటున్న మరో నీట్ అభ్యర్థి బాధితురాలికి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. 
 
ఈ ఘటన జరిగిన రోజున ఏదో కారణంతో ఆమెను తన గదికి పిలిపించాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసిన కోట పోలీసు... గ్యాంగ్ రేప్ నేరంతో పాటు పలు ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులందరూ స్థానికంగా ఉన్న ఓ కోచింగ్ సెంటరులో నీట్ కోసం సిద్ధమవుతున్నారు. నిందితుల్లో ఒకరిది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కాగా, మిగిలినవారంతా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన యువకులుగా గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"సైరన్" ఆడియో లాంఛ్.. నలుపు, బంగారు రంగు చీరలో మెరిసింది..