Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో స్టూడియోలు క‌ట్టేందుకు ముందుకు వ‌స్తోన్న సినీతార‌లు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినీ స్టూడియోలో క‌ట్టేందుకు ప్ర‌భుత్వం అన్నిర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో సినీతార‌లు ముందుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే నంద‌మూరి బాల‌కృష్ణ వైజాగ్‌లో స్టూడియో క‌

ఏపీలో స్టూడియోలు క‌ట్టేందుకు ముందుకు వ‌స్తోన్న సినీతార‌లు..!
, శనివారం, 25 ఆగస్టు 2018 (13:54 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినీ స్టూడియోలో క‌ట్టేందుకు ప్ర‌భుత్వం అన్నిర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో సినీతార‌లు ముందుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే నంద‌మూరి బాల‌కృష్ణ వైజాగ్‌లో స్టూడియో క‌ట్టేందుకు రెడీ అవుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.


ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ప్రముఖ సినీనిర్మాత, ఫిల్మ్‌ డవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అంబికా కృష్ణ సినీ ఇండస్ట్రీని ఏపీకి తరలించేందుకు చేపడుతున్న పనులు తదితర విషయాలను మీడియాతో పంచుకున్నారు.
 
ఇంత‌కీ ఆయ‌న ఏమ‌ని చెప్పారంటే... 2008లో అప్పటి ప్రభుత్వం 316 ఎకరాలు వైజాగ్‌లో గుర్తించింది. ఆ స్థలం ఉందా లేదా అని నేను ఇటీవల స్వయంగా పరిశీలించాను. ఎలాంటి ఇబ్బంది లేదని అర్థమైంది. అయితే ఆ ప్రదేశంలో ఒక్కో ఎకరా రూ.50 లక్షలు ఉంటుంది. ధర తగ్గించమని ప్రభుత్వాన్ని అడిగానని.. ఇప్పటికే బాలకృష్ణ ఆ ప్రదేశంలో సినిమా తీసేందుకు ముందుకు వచ్చారు. 
 
అలాగే ఏవీఎమ్‌ స్డూడియో వాళ్లు కూడా ఉత్సాహంగా ఉన్నారని అంబికా కృష్ణ చెప్పారు. మోహన్‌బాబు తిరుపతిలో స్టూడియో కట్టేందుకు ఓ లెటర్‌ పెట్టారు. ఎన్టీఆర్‌ స్డూడియో అనే పేరుతో నెల్లూరులో 300 ఎకరాలతో ఓ మినీ రామోజీ ఫిలిం సిటీ కట్టాలనుకునే ఉద్దేశంతో ఓ వ్యక్తి ఇటీవల నా వద్దకు వచ్చారు. రూ.3500 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు అని తెలియ‌చేసారు. ఇదంతా చూస్తుంటే.. ఏపీలో సినీ ఇండ‌స్ట్రీ అభివృద్దికి బాగానే ప్లాన్ చేస్తున్న‌ట్టు అనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూరి నెక్ట్స్ మూవీ ఆ అబ్బాయితోనట..?