Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇలా అయితే లావు తగ్గను కానీ.. యోగానే శరణ్యం.. అనుష్క కఠోర నిర్ణయం

ఏ క్షణంలో సైజ్ జీరో సినిమాకు సైన్ చేయాలని నిర్ణయం తీసుకుందో అప్పటినుంచి అనుష్క తన భారీకాయాన్ని చూసుకుని దిగులుపడిన క్షణం లేదు. లావుగా ఉన్న మహిళల సమస్యను వెండితెరపై చూపించాలని న్యాయంగానే భావించిన అనుష్

Advertiesment
Bhagamati
హైదరాబాద్ , బుధవారం, 21 జూన్ 2017 (06:03 IST)
ఏ క్షణంలో సైజ్ జీరో సినిమాకు సైన్ చేయాలని నిర్ణయం తీసుకుందో అప్పటినుంచి అనుష్క తన భారీకాయాన్ని చూసుకుని దిగులుపడిన క్షణం లేదు. లావుగా ఉన్న మహిళల సమస్యను వెండితెరపై చూపించాలని న్యాయంగానే భావించిన అనుష్క ఆ చిత్రంలో తన పాత్ర కోసం బాగా తిని బాగా లావయింది. ఎంతగానంటే 80 కేజీల బరువును సంపాదించుకుంది. ఎలాగోలా సినిమా పూర్తి చేసింది. కానీ పెంచిన బరువును ఎలా తగ్గించుకోవాలో రెండేళ్ల తర్వాత కూడా అనుష్కకు అర్థం కావడం లేదు. దీంతో యోగా టీచర్‌గా తన అనుభవాన్ని రంగరించి లావు తగ్గాలని డిసైడ్ అయిపోయింది. అంటే బ్యాక్ టు యోగా అన్నమాట.

 
మనిషి మానసిక రుగ్మతలను దూరం చేసి అందాన్ని, ఆనందాన్ని పెంచేది యోగా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందాన్ని పెంచడమే కాదు మందాన్ని తగ్గించే శక్తి యోగాకు ఉంది. ఈ విషయం నటి అనుష్కకు బాగా తెలుసు. మొదట్లో యోగా టీచర్‌ అయిన ఈ స్వీటీ ఆనక యాక్టర్‌ అయిన విషయం తెలిసిందే. కాగా ఇంజి ఇడుప్పళగి (తెలుగులో జీరో సైజ్‌) చిత్రం కోసం బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత బహుబలి–2 చిత్రం కోసం తగ్గడానికి చేయని కసరత్తులు లేవట. 
 
అయినా ఫలితం లేకపోవడంతో చివరికి ఈ భామను నాజూగ్గా ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి గ్రాఫిక్స్‌ను ఆశ్రయించక తప్పలేదు. అందుకు భారీ మొత్తాన్నే ఖర్చు చేశారట. కాగా ప్రస్తుతం అనుష్క చేతిలో భాగమతి అనే ఒకే ఒక్క చిత్రం ఉంది. అదీ చిత్రీకరణను పూర్తి చేసుకుందని సమాచారం.

కొత్త చిత్రాలను అంగీకరించకపోవడంతో అనుష్క పెళ్లికి సిద్ధం అవుతున్నారని, అందుకే నూతన చిత్రాలను ఒప్పుకోవడం లేదని ప్రచార మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. అసలు విషయం ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో అనుష్క యోగానే శరణ్యంగా భావించి నటనను కొంతకాలం దూరంగా పెట్టి యోగాలో మునిగితేలనున్నారట. 

ఒక పక్క నటిస్తూ యోగాకు పూర్తిసమయాన్ని కేటాయించడం సాధ్యం కాకపోవడంతో అనుష్క ఈ నిర్ణయానికి వచ్చారట. ప్రభాస్‌ తాజా చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మనే నాయకి అని ప్రచారం జరుగుతున్నా, అధికారికపూర్వక ప్రకటన ఇంతవరకూ రాలేదు. ఇకపోతే యోగాకు కేటాయించిన కాలాన్ని పూర్తి చేసుకుని కొత్త అందాలతో గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
అయినా అనుష్క భయమే కానీ, ఆమె లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా చూడడానికి ప్రేక్షకులు పరుగెత్తుతున్నప్పడు ఆమె లావుతో అభ్యంతరం ఎవరికుంటుంది? 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా ఇండస్ట్రీని వదిలేద్దామన్నా... అది మనల్ని వదలదు.. తేల్చిచెప్పిన చిరంజీవి