రానా బ్రదర్ అయితే.. మరి ప్రభాస్ ఏమవుతాడు...? 'డార్లింగ్'పై దేవసేన మనసుపడిందా!
దగ్గుబాటి రానా తనకు సోదరుడు వంటివాడని దేవసేన అనుష్క చెప్పింది. మరీ ప్రభాస్ గురించి మాట్లాడుతూ... డార్లింగ్ తనకు ఏమవుతాడో.. ఏమని పిలుస్తాడో చెప్పలేదు గానీ, మంచి అందగాడని సమాధానమిచ్చింది. అంటే.. ప్రభాస్
దగ్గుబాటి రానా తనకు సోదరుడు వంటివాడని దేవసేన అనుష్క చెప్పింది. మరీ ప్రభాస్ గురించి మాట్లాడుతూ... డార్లింగ్ తనకు ఏమవుతాడో.. ఏమని పిలుస్తాడో చెప్పలేదు గానీ, మంచి అందగాడని సమాధానమిచ్చింది. అంటే.. ప్రభాస్ దేవసేన మనసుపడినట్టేనని బాహుబలి ఫ్యాన్స్ అంటున్నారు. దీనికీ ఓ కారణం లేకపోలేదు.
నిజానికి ప్రభాస్, అనుష్కల మధ్య ఏదో ఉందని.. ఒకరికొకరు సరైన జోడీ.. వీరిద్దరూ ఒక్కటైతే (పెళ్లి చేసుకుంటే) బాగుంటుందని.. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కోడై కూస్తోంది. ఇదే అంశంపై ఫిల్మ్ నగర్‌లో కూడా చర్చ సాగుతున్నట్టు సమాచారం.
ఈనేపథ్యంలో బాహుబలి హీరోలు ప్రభాస్, రానాల గురించి అనుష్క తన మనసులోని మాటను వెల్లడించింది. బాహుబలి సినిమాలో కో స్టార్స్‌గా నటించిన ప్రభాస్, రానా.. వీరిద్దరిలో ఎవరు అందగాడు..? అని ఓ యాంకర్ ప్రశ్నించగా.. ఏమాత్రం తడుముకోకుండా ప్రభాస్ అని ఠకీమని చెప్పేసింది అనుష్క.
మరి రానా సంగతేంటి? అని ప్రశ్నించగా.. రానా తనకు సోదరుడిలాంటి వాడని చెప్పింది. రానాను బ్రదర్ అని పిలుస్తానని, రానా కూడా తనను సిస్టర్‌లాగా చూస్తాడని చెప్పుకొచ్చింది. అంటే ప్రభాస్‌పై అనుష్క మనసుపడినట్టుగా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.