ఆదిత్యా చోప్రా వల్లే ఈ స్థాయికి ఎదిగాను.. ఆయనే నా గాడ్ ఫాదర్: అనుష్క శర్మ
బాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలను పండించే ఆదిత్యా చోప్రాను బాలీవుడ్ అగ్ర హీరోయిన్, విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ ఆకాశానికెత్తేసింది. ఆదిత్యా చోప్రా లేకుంటే తాను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని అనుష్క
బాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలను పండించే ఆదిత్యా చోప్రాను బాలీవుడ్ అగ్ర హీరోయిన్, విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ ఆకాశానికెత్తేసింది. ఆదిత్యా చోప్రా లేకుంటే తాను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని అనుష్క శర్మ తెలిపింది. 2008లో షారూఖ్ ఖాన్ హీరోగా రబ్‌నే బనాది జోడీ సినిమాతో తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఆదిత్యా చోప్రాను ఎప్పటికీ మరిచిపోనని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది.
కాబట్టి ఆయనే తన గాడ్ ఫాదర్ అని.. తొలి సినిమా ద్వారా ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయలేదని.. అందుకే ఆపై సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగానని చెప్పుకొచ్చింది. కాగా తాజాగా సల్మాన్ ఖాన్‌తో అనుష్క శర్మ నటిస్తున్న "సుల్తాన్'' సినిమాను కూడా ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఎనిమిదేళ్ల పాటు హిందీ సినీ పరిశ్రమలో తన పేరును సుస్థిరం చేసుకున్న ఈ భామ నటనా పరంగానూ, గ్లామర్ పరంగానూ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న సంగతి విదితమే.