Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ బాధ తట్టుకోలేక బాగా ఏడ్చేసేదాన్ని.. సెట్లో మాత్రం బయటపడేదాన్ని కాదు: అనుష్క

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన అనుష్క ప్రస్తుతం బాహుబలి 2, ఓం నమో వేంకటేశాయ, భాగమతి చిత్రాల్లో బిజీగా ఉంటోంది. లేడీ ఓరియెంటెడ్ రోల్స్‌లో ధీటుగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ రోల్స్

Advertiesment
Anushka Personal Interview
, సోమవారం, 25 జులై 2016 (11:37 IST)
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన అనుష్క ప్రస్తుతం బాహుబలి 2, ఓం నమో వేంకటేశాయ, భాగమతి చిత్రాల్లో బిజీగా ఉంటోంది. లేడీ ఓరియెంటెడ్ రోల్స్‌లో ధీటుగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ రోల్స్ చేసేటప్పుడు తాను అనుభవించిన కష్టాన్ని నోరు విప్పి చెప్పింది.

ఏ రంగంలోనైనా కష్టంలేనిదే ఫలితం ఉండదు. సుఖం అంతకన్నా ఉండదు. అరుంధతి, రుద్రమదేవి, సైజ్‌జీరో, బాహుబలి చిత్రాలకు ఎక్కువ కాల్షీట్లు ఇచ్చి రెట్టింపు కష్టపడ్డానని చెప్పింది.
 
లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ చాలా కష్టంతో కూడినవని.. చాలా శ్రమపడి చేశానని అనుష్క తెలిపింది. షూటింగ్‌ పేకప్‌ అయ్యాక ఇంటికెళ్తే ఒళ్లంతా ఒకటే నొప్పులుగా ఉండేదని.. తట్టుకోలేక బాగా ఏడ్చేసేదాన్నని.. ఇంట్లో తన వైపు ఉన్నోళ్ల కూడా ఇబ్బంది పెట్టేదానినని అనుష్క చెప్పేసింది. 
 
సెట్లో మాత్రం తన బాధను పైకి తెలియనిచ్చేదానిని కాదని తెలిపింది. తనకు మంచి పేరును సంపాదించి పెట్టిన సినిమాలు ఇవే తాను పరిశ్రమలో ఉన్నా లేకపోయినా ఈ సినిమాలు తనను అభిమానులకు ఎప్పుడూ గుర్తుచేస్తుంటాయని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబుకు తల్లిగా ''బిచ్చగాడు'' దీపా రామానుజం: ఆగస్టు నుంచి షూటింగ్?!