Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి2 మెయిన్ ట్రైలర్ విడుదల కాదేమీ.. అనుష్క లావే కారణమా?

పోస్టర్లు విడుదలవుతున్నాయి. స్కూప్ వార్తలు పుంఖానుపంఖాలుగా వస్తూనే ఉన్నాయి. కానీ చిత్రం అసలు ట్రైలర్ మాత్రం విడుదల కాదు. చిత్రం విడుదలకు సరిగ్గా రెండునెల్ల సమయం మాత్రమే ఉంది. ఏప్రియల్ 28. అయినా చిత్రం

Advertiesment
Anushka
హైదరాబాద్ , మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (07:43 IST)
పోస్టర్లు విడుదలవుతున్నాయి. స్కూప్ వార్తలు పుంఖానుపంఖాలుగా వస్తూనే ఉన్నాయి. కానీ చిత్రం అసలు ట్రైలర్ మాత్రం విడుదల కాదు. చిత్రం విడుదలకు సరిగ్గా రెండునెల్ల సమయం మాత్రమే ఉంది. ఏప్రియల్ 28. అయినా చిత్రం ట్రైలర్ విడుదల కాదు. కారణం ఏమిటి? చివరి వరకు సస్పెన్స్‌లో ముంచే ప్లాన్‌లో భాగమా? అదేమీ కాదట. బాహుబలి 2 మెయిన్ ట్రైలర్ ఇంకా విడుదల కాకపోవడానికి అనుష్కే కారణమట
 
ప్రయోగాలు ఒక్కోసారి వికటిస్తాయి. నటి అనుష్క విషయంలో అదే జరిగింది. ఈ యోగా సుందరి మంచి నటే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమె నటించిన అరుంధతి, రుద్రమదేవి లాంటి కథానాయకి ప్రాధాన్యత ఉన్న చిత్రాలే నిదర్శనం. ఆ చిత్రాల విజయాలిస్తున్న ఉత్సాహంతో అనుష్క ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరోసైజ్‌) అనే ద్విభాషా చిత్రం చేశారు. అది ఒక ప్రయోగాత్మక చిత్రమే అని చెప్పవచ్చు. అందుకోసం తన అందమైన బాడీని బొద్దుగా మార్చుకోవడానికి అనుష్క వెనుకాడలేదు. దాదాపు 80 కిలోల బరువుకు తనను పెంచుకుని ఆ చిత్రంలో నటించారు.
 
అయితే ఆ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. సరే జయాపజయా లు సర్వసాధారణం అని సరిపెట్టుకుంటే, పెంచుకున్న బరువును తగ్గించుకోవడానికి అనుష్క నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయినా ఇంజి ఇడుప్పళగి చిత్రానికి ముందు అనుష్కలా నాజూగ్గా మారలేకపోయింది. ఇది తన తదుపరి చిత్రానికి పెద్ద సమస్యగా మారింది. ఈ ముద్దు గుమ్మ రాజమౌళి వెండితెరపై చెక్కిన బాహుబలి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌ కూడా ఏప్రిల్‌ 28న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్ర టీజర్, మోషన్ టీజర్‌లు ఇప్పటికే విడుదలై విశేష స్పందన పొందుతున్నాయి.
 
అయినప్పటికీ చిత్రం మెయిన్ ట్రైలర్‌ విడుదల కాలేదు. ఇందుకు కారణం అనుష్కేనట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి అంగీకరించినట్లు మీడియా ప్రచారం. అనుష్క బాహుబలిలో కనిపించిన రూపానికి, రెండో భాగంలో కనిపించిన రూపానికి చాలా తేడా ఉండడంతో ఆమె నటించిన సన్నివేశాలకు అధికంగా వీఎఫ్‌ఎక్స్‌ అవసరం అయిందట. 
 
ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం పెరిగిన బరువును అనుష్క పూర్తిగా తగ్గించుకోలేకపోవడంతో వీఎఫ్‌ఎక్స్‌ పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడాల్సి వచ్చిందట. అయితే బాహుబలి–2 చిత్ర ట్రైలర్‌ విడుదలలో ఆలస్యానికి అనుష్క మాత్రమే కారణం కాదని దర్శకుడు రాజమౌళి పేర్కొనడం కొసమెరుపు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్కార్‌లో మెరిసిన మన భారతీయ చీరకట్టు