Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉయ్యాలవాడలో అనుష్క... చిరు సగం గట్టెక్కేసినట్లే మరి

బాహుబలి 2 లో దేవసేన పాత్రలో ఒలికించిన ఆ రాజసం చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చరిత్రకు, ఫాంటసీకి సంబంధించిన ఏ సినిమా అయినా సరే యువరాణిగా, రాణిగా, రాజకుమారిగా ఆమె అయితేనే చూస్తాం అనేం

ఉయ్యాలవాడలో అనుష్క... చిరు సగం గట్టెక్కేసినట్లే మరి
హైదరాబాద్ , గురువారం, 6 జులై 2017 (07:28 IST)
బాహుబలి 2 లో దేవసేన పాత్రలో ఒలికించిన ఆ రాజసం చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చరిత్రకు, ఫాంటసీకి సంబంధించిన ఏ సినిమా అయినా సరే యువరాణిగా, రాణిగా, రాజకుమారిగా ఆమె అయితేనే చూస్తాం అనేంత క్రేజీని సంపాదించుకుంది దేవసేన. ఆ క్రేజ్ అనుకోని భాగ్యం కాదు. పదేళ్లకుపైగా చిత్ర పరిశ్రమలో నలుగుతూ, రాపాడుతూ, మెరగొందుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్న విజయ దరహాసం ఆమె. ఆమే అందరూ మెచ్చుతున్న అనుష్క.
 
‘బాహుబలి’ తరువాత బాలీవుడ్‌లో కూడా అనుష్కకి ఎంత క్రేజ్ వచ్చేసిందంటే లెక్కలేనన్ని ఆఫర్లు ఆమె వెంటపడ్డాయి. కానీ అప్పటికే ఒప్పుకున్న భాగమతి తప్ప మరే చిత్రానికి ఆమె అంగీకారం తెలుపలేదు. ఇక తెలుగు, తమిళ్‌లో అనుష్కకి వున్న క్రేజ్ తెలిసిందే. ఇంత క్రేజ్ వుండి.. అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు రెడీగా వున్నా .. అనుష్క మాత్రం తన కొత్త ప్రాజెక్ట్ విషయంలో తొందరపడడం లేదు. 
 
అయితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి అనుష్క ఓకే అనేసిందనేది లేటెస్ట్ టాక్. మెగాస్టార్ చిరంజీవి 151 సినిమాగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ తెరకెక్కబోయే విషయం తెలిసిందే. ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్న రామ్‌చరణ్ లీడ్ రోల్ కోసం ఆఫర్ ఇవ్వడంతో అనుష్క ఒప్పుకోవడం జరిగిపోయిందట. ఇక అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి. చేయడమే మిగిలిందనేది ఇన్‌సైడ్ టాక్. ప్రస్తుతం అనుష్క లీడ్ రోల్ చేస్తోన్న ‘భాగమతి’ రిలీజ్‌కి రెడీ అవుతోంది.
 
తాజాగా అనుష్క ప్రభాస్ సరసన సాహో చిత్రంలో లీడ్ రోల్‌లో నటించడానికి అవకాశం దక్కించుకుందని వార్తలు. ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా లీడ్ రోల్ తనకే దక్కింది. సెలెక్టివ్‌గా అయినా సరే అనుష్క సరైన చిత్రాలనే ఎంచుకుంటోందని  అర్థమవుతోంది కదూ.
 
ఆలస్యంగా ఎంచుకున్నప్పటికీ అనుష్క ఎంపిక ద్వారా ఉయ్యాలవాడకు ఫేస్ వాల్యూ వచ్చేసినట్లే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాహో హీరోయిన్ ప్రనుష్కే నట..రమేష్ బాలా ట్వీట్ నిజమే చెబుతోందా?