Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

300 చిత్రంలో శ్రీదేవి.. నట రారాణికి నీరాజనం

దేవకన్య పాత్రలో అయినా.. చలాకిపిల్లగా అయినా ఆమె తెరపైకి వచ్చిందంటే మిగతా నటులూ, హీరోలూ, రెండో, మూడో కథానాయికలూ అలా ఫేడవుట్ అయి నిల్చోవాల్సిందే.. ఇక అమాయక పాత్రల్లో తను కనబడిందంటే కోట్లమంది ఫిదా అయిపోవాల్సిందే. పదహారేళ్ల వయసుతో మొదలై హిమ్మత్ వాలా నుంచి

Advertiesment
Sridevi
హైదరాబాద్ , బుధవారం, 5 ఏప్రియల్ 2017 (02:31 IST)
దేవకన్య పాత్రలో అయినా.. చలాకిపిల్లగా అయినా ఆమె తెరపైకి వచ్చిందంటే మిగతా నటులూ, హీరోలూ, రెండో, మూడో కథానాయికలూ అలా ఫేడవుట్ అయి నిల్చోవాల్సిందే.. ఇక అమాయక పాత్రల్లో తను కనబడిందంటే కోట్లమంది ఫిదా అయిపోవాల్సిందే. పదహారేళ్ల వయసుతో మొదలై హిమ్మత్ వాలా నుంచి జగదేకవీరుడు అతిలోక సుందరి వరకు ఆమె కాలుపెట్టిన ఎవరి సినిమాలో అయినా సరే ఆ సౌందర్య జ్వాల ముందు మహామహులు తల వంచాల్సిందే. ఆమె శ్రీదేవి 45 ఏళ్లకు పైగా నటజీవితంలో ఉంటున్న శ్రీదేవి తాజా చిత్రం మామ్. ఇది ఆమెకు 300 సినిమా మరి.
 
టాలీవుడ్, కొలివుడ్, బాలీవుడ్ అన్ని ఉడ్ లలోనూ ఇప్పుడు ఎవరైనా వంద సినిమాలు తీశారంటే ఎవరెస్టు శిఖరం ఎక్కేసిన మాటే మరి అలాంటిది ఇటీవల కాలంలో ఎవరికీ సాద్యం కానన్ని చిత్రాలను తన రికార్డులో వేసుకున్న శ్రీదేవి తాజాగా రవి ఉడయార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మమ్‌' చిత్రంలో శ్రీదేవి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోనీకపూర్‌ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ రూపుదిద్దుకుంటోంది. జూన్‌ 14న మామ్‌ చిత్రం విడుదల కానుంది. 
 
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌... అతిలోక సుందరి శ్రీదేవిపై ప్రశంసల జల్లు కురిపించారు. క్వీన్‌ ఆఫ్‌ యాక్టింగ్‌ మళ్లీ తెరపై కనిపించడం సంతోషంగా ఉందని ఆయన ట్విట్‌ చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి నటిస్తున్న 'మమ్‌' టీజర్‌ లింక్‌ను కూడా అనుపమ్‌ ఖేర్‌ షేర్‌ చేశారు. అనుపమ్‌ ఖేర్‌ పలు చిత్రాల్లో శ్రీదేవితో కలిసి నటించారు. వీరిద్దరూ 'కర్మా', చాల్‌బాజ్‌, లడ్లా, లమ్హే, రూప్‌కీ రాణీ చోరోంకా రాజా చిత్రాల్లో శ్రీదేవితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. 
 
సుదీర్ఘ విరామం తర్వాత శ్రీదేవి 2012లో 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయ్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం పులిలో ఓ ముఖ్యపాత్ర పోషించారు. తాజాగా నటిస్తున్న మామ్ చిత్రంలో సవతి కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడే ఓ ధీరోదాత్తమైన తల్లిగా శ్రీదేవి కనిపించనున్నట్టు తెలుస్తోంది. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన శ్రీదేవి ఇప్పటివరకూ 299 చిత్రాల్లో నటించారు. ‘మామ్‌’తో ఆమె 300వ చిత్రం మైలురాయిని చేరుకున్నారు.
 
అమాయకపు వదనంతో భారతీయ చలనచిత్ర ప్రేక్షకుల మతులు పోగొట్టిన శ్రీదేవి చిత్రజీవితం ఇలాగే సాగిపోవాలని కోరుకుందాం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనవాళ్లకు తెలుగమ్మాయిలు పనికిరారా... కుర్రహీరోలకూ వాళ్లే కావాలి