Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు కాస్త పొగరెక్కువ.. చెప్పింది ఎవరో తెలుసా?

టాలీవుడ్ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్.. తాజాగా నాగచైతన్యతో ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమాలో నటిస్తోంది. తెలుగు తెరపై నటనతో పాటు గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన అనూ ఇమ్మాన్యుయేల్.. చైతూతో చేస్తున్

Advertiesment
Anu Emmanuel
, సోమవారం, 11 జూన్ 2018 (11:20 IST)
టాలీవుడ్ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్.. తాజాగా నాగచైతన్యతో ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమాలో నటిస్తోంది. తెలుగు తెరపై నటనతో పాటు గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన అనూ ఇమ్మాన్యుయేల్.. చైతూతో చేస్తున్న సినిమా గురించి నోరువిప్పింది. మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. 
 
ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర ఈగోయిస్టిక్‌గా వుంటుందట. ఈ విషయాన్ని అనూనే స్వయంగా తెలిపింది. కాస్త పొగరుగా కనిపించే ఈ పాత్రలో తాను కొత్తగా కనిపిస్తానని అంది. ఈ తరహా పాత్రలో కనిపించడం ఇదే తొలిసారని చెప్పింది. ఇక తనకి తల్లిగా రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అనూ వెల్లడించింది.
 
''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమా షూటింగ్ చాలావరకూ పూర్తయ్యింది. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయట. వాటిలో ఒకటైన సంగీత్ సందర్భంలో వచ్చే పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సినిమాలోని ప్రధాన తారాగణమంతా ఈ పాటలో కనిపించనున్నారు. ఈ పాట కోసం ప్రత్యేకమైన సెట్ వేసి అయిదు రోజుల పాటు చిత్రీకరించనున్నారు. ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెలెబ్రిటీలపై మండిపడిన సంజన.. తొలిరోజే బిగ్‌బాస్ హౌస్‌లో?