అందాల ముద్దుగుమ్మ, యాంకర్ రేష్మికి టాలీవుడ్‌లో క్రేజ్ బాగా పెరిగిపోతోంది. గుంటూరు టాకీస్‌తో హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసిన రేష్మి.. తాజాగా ‘అంతం’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతో అంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన రేష్మీ.. ప్రస్తుతం హాట్ హీరోయిన్‌గా దర్శకనిర్మాతలకు బాగా నచ్చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా జిఎస్‌ఎస్‌పి కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన అంతం అనే చిత్రంలో రేష్మి లీడ్ రోల్ పోషించింది. చరణ్‌దీప్, రేష్మితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనుల్ని జరుపుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. లవ్, రొమాన్స్‌తో కూడిన హార్రర్ సినిమాగా వస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.