Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్‌ నుండి 'అంతం లేని కథ'... థ్రిల్లర్ కథాంశంతో...!

Advertiesment
'Antham Leni Katha' regular shooting from June first week
, సోమవారం, 23 మే 2016 (10:45 IST)
ప్రముఖ నిర్మాత డాక్టర్‌. సి. ఆర్‌. మనోహర్‌ ఆశీస్సులతో వసంత్‌ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ నిర్మాణంలో..దాసరి గంగాధర్‌ దర్శకత్వంలో సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో జూన్‌ మొదటి వారం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనున్న చిత్రం 'అంతం లేని కథ'. లేడీ ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ నటించనుంది. 
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దాసరి గంగాధర్‌ మాట్లాడుతూ...'ఓ ప్రముఖ హీరోయిన్‌ నటించనున్న మా 'అంతం లేని కథ' చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ మొదటి వారం నుండి మొదలవుతుంది. సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ ఇది. భారీ తారాగణంతో ఈ మూవీ రూపుదిద్దుకోనుంది. ఆసక్తికరమైన కథనంతో.. అందర్నీ థ్రిల్లింగ్‌కి గురిచేసే కథతో 'అంతం లేని కథ' సరికొత్తగా ఉంటుంది. డైరెక్టర్‌గా నన్ను నేను నిరూపించుకునే చిత్రమిది. ప్రేక్షకులందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను...' అని అన్నారు. 
 
ఓ ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ నటించనున్న ఈ చిత్రంలో పశుపతి, భానుచందర్‌, దేవన్‌, నిళల్‌ గళ్‌ రవి, వడివుక్కరసి, సీత, కాంచన, శరణ్య, హేమ, బాబుమోహన్‌, తాగుబోతు రమేష్‌..మొదలగువారు ఇతర తారాగణం. ఈ చిత్రానికి డి.ఓ.పి.: ఎస్‌.డి.జాన్‌, సంగీతం: డి. ఇమాన్‌, ఎడిటర్‌: శంకర్‌, మాటలు: బాసిన వీరబాబు, నిర్మాణం: వసంత్‌ మూవీ క్రియేషన్స్‌, దర్శకత్వం: దాసరి గంగాధర్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్నీ కొత్త ప్రచారం.. మార్కెట్లోకి వచ్చేసిన కొత్త బ్రాండ్!