Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇటలీలో చిత్రికరించిన అన్నీ మంచి శకునములే

Advertiesment
Santosh Shobhan, Malvika Nair
, గురువారం, 20 ఏప్రియల్ 2023 (19:13 IST)
Santosh Shobhan, Malvika Nair
స్వప్న సినిమా ప్రొడక్షన్ హౌస్ కథల ఎంపికలో ఎంత జాగ్రత్త తీసుకుంటుందో సంగీతం విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకుంటుంది. స్వప్న సినిమా వారి గత సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్. ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'అన్నీ మంచి శకునములే' సినిమా కూడా థియేటర్లలోకి రాకముందే మ్యూజికల్ హిట్ అవుతోంది.
 
సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు థర్డ్ సింగిల్‌  గల గల ఏరులా పాటని విడుదల చేసారు. ఈ డ్రీమీ నెంబర్ ప్లజంట్ గా ప్రారంభమైయింది. మిక్కీ జే మేయర్ తనదైన శైలిలో శ్రోతలని మెస్మరైజ్ చేసే నెంబర్ ని కంపోజ్ చేశారు. విభిన్న వాయిద్యాలతో పాటని చాలా రిచ్ గా ఆర్కెస్ట్రేషన్ చేశారు. రెహ్మాన్ లిరిక్స్ రాశారు. నకుల్ అభ్యంకర్, రమ్య భట్ అభ్యంకర్ గానం మరింత ఆకర్షణని తీసుకొచ్చింది.
 
ఇటలీలోని కొన్ని అందమైన లొకేషన్లలో ఈ పాట చాలా ప్లజంట్ గా చిత్రీకరించారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ఉత్సాహంగా కనిపించారు. వారి కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. కొరియోగ్రఫీ చక్కగా ఉంది.
 
అన్నీ మంచి శకునములే చిత్రంలో రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 
మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దావూద్ స్క్రీన్ ప్లే అందించగా, లక్ష్మీ భూపాల డైలాగ్ రైటర్. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవిష్ణు నటించిన సామజవరగమన నుండి వాట్ టు డూ సాంగ్ విడుదల