చిత్రాంగద ఎక్కడికెళ్లింది.. అంజలి తెలుగులో కనిపించట్లేదే ఏమైంది..
చిత్రాంగద ఎక్కడికెళ్లింది.. అంజలి ఎక్కడా కనిపించట్లేదే అంటూ సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. "గీతాంజలి" తర్వాత అంజలి ఇమేజ్ మారింది. కామెడీ థ్రిల్లర్, హారర్ కామెడీ కథలు ఆమె కోసం సిద్ధం అవుతున్నాయ
చిత్రాంగద ఎక్కడికెళ్లింది.. అంజలి ఎక్కడా కనిపించట్లేదే అంటూ సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. "గీతాంజలి" తర్వాత అంజలి ఇమేజ్ మారింది. కామెడీ థ్రిల్లర్, హారర్ కామెడీ కథలు ఆమె కోసం సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే 'చిత్రాంగద' సెట్స్ పైకి వెళ్ళింది.
పిల్లజమిందార్ సినిమాతో ఆకట్టుకొన్న అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. కానీ సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు.
ప్రస్తుతం అంజలి తెలుగులో కనిపించడం లేదు. దర్శకుడు భాగమతితో బిజీగా వున్నాడు. నిర్మాతలు ఏవో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారాని టాక్. దీంతో చిత్రాంగద ముందుకు కదలడం లేదు. అయితే త్వరలోనే ఓ రిలీజ్ డేట్ చెబుతారన్నారు.
ఇకపోతే.. తెలుగమ్మాయి అయిన అంజలికి పెళ్ళి కూడా ఫిక్స్ అయ్యింది. త్వరలోనే ఓ కోలీవుడ్ యంగ్ హీరోతో ఈ బ్యూటీ మూడు ముళ్లు వేయించుకుంటోదట. పెళ్ళి పనుల్లో ఉండబట్టే అమ్మడు తెలుగు తెరపై అంతగా కనిపించట్లేదని టాక్.