Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుచీలీక్స్‌పై ధనుష్‌ను ప్రశ్నించిన యాంకర్.. ఇంటర్వ్యూ నుంచి వాకౌట్ చేసిన వీఐపీ

సుచీలీక్స్ ద్వారా కోలీవుడ్‌లో బాగా వినిపించిన పేరు ధనుష్. తమిళ చిత్ర పరిశ్రమలో సుచీలీక్స్ ఉదంతం సంచలనం రేపింది. సినీ ప్రముఖుల కంటిపై నిద్ర లేకుండా గాయని సుచిత్ర చేశారు. కోలీవుడ్‌లోని ప్రముఖ హీరోలు ధను

Advertiesment
సుచీలీక్స్‌పై ధనుష్‌ను ప్రశ్నించిన యాంకర్.. ఇంటర్వ్యూ నుంచి వాకౌట్ చేసిన వీఐపీ
, సోమవారం, 24 జులై 2017 (12:08 IST)
సుచీలీక్స్ ద్వారా కోలీవుడ్‌లో బాగా వినిపించిన పేరు ధనుష్. తమిళ చిత్ర పరిశ్రమలో సుచీలీక్స్ ఉదంతం సంచలనం రేపింది. సినీ ప్రముఖుల కంటిపై నిద్ర లేకుండా గాయని సుచిత్ర చేశారు. కోలీవుడ్‌లోని ప్రముఖ హీరోలు ధనుష్, అనిరుధ్, రానా, త్రిష, ఆండ్రియా తదితరుల పేర్లు సుచీలిక్స్‌లో ప్రముఖంగా వినిపించాయి.

తాజాగా వీఐపీ2 ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ధనుష్ ఓ మీడియా ఛానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. యాంకర్ సుచీలీక్స్‌కు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆగ్రహం చెందిన ధనుష్ మైక్ విసిరి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. 
 
వ్యక్తిగత విషయాల గురించి అడగొద్దని యాంకర్‌కు ధనుష్ చెప్పినా.. సుచీలీక్స్ ద్వారా కొన్ని వీడియోలు, వదంతలు బహిర్గతం అయ్యాయని.. వాటి గురించి మీరేమంటారు.. అనే ప్రశ్నకు ధనుష్ దాట వేశారు. తనకు తెలిసిందల్లా సినిమాలేనని.. తన ప్రపంచం అదేనని చెప్పాడు.

సుచీలీక్స్ సంబంధించి ఒక ప్రశ్నకూ ఆయన సమాధానం ఇచ్చేందుకు ఇష్టపడలేదు. కానీ యాంకర్ మాత్రం సుచీలీక్స్‌పై సరైన సమాధానం రాబట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. చివరకు వ్యక్తిగత అంశాలపై ప్రశ్నలొద్దని.. మైక్ కట్ చేసి వెళ్ళిపోయారు.
 
కాగా ధనుష్ ఈ మధ్య పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ధనుష్ తమ కుమారుడంటూ.. కస్తూరి రాజా ఆయన తండ్రి కాదంటూ ఓ వృద్ధ జంట కోర్టుకెక్కింది. ఇంకా సుచీలీక్స్ ద్వారా ధనుష్ హీరోయిన్లతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ వివాదాలు కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాలపై ధనుష్ తాజా ఇంటర్వ్యూలో నోరెత్తలేదు. వీఐపీ 2 గురించి మాత్రమే ప్రస్తావించి.. ఇంటర్వ్యూను ముగించుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగస్థలం గురించి సమంత ఏం చెప్పింది.. కేటీఆర్‌కు సమంత థ్యాంక్స్ ఎందుకు?