Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వాములకు రాజకీయాలు అవసరమా?: యాంకర్ సుమ సూటి ప్రశ్న

స్వాములకు రాజకీయాలు అవసరమా? అంటూ పరిపూర్ణానంద స్వామిని టీవీ యాంకర్ సూటిగా ప్రశ్నించింది. ఈ స్వామి ఇటీవల ఓ చానల్‌ను ప్రారంభించారు. భారతీయత గురించి ఆ చానల్‌లో వివరిస్తుంటారు. హిందూ ధర్మాన్ని బోధిస్తున్న

స్వాములకు రాజకీయాలు అవసరమా?: యాంకర్ సుమ సూటి ప్రశ్న
, ఆదివారం, 28 మే 2017 (17:52 IST)
స్వాములకు రాజకీయాలు అవసరమా? అంటూ పరిపూర్ణానంద స్వామిని టీవీ యాంకర్ సూటిగా ప్రశ్నించింది. ఈ స్వామి ఇటీవల ఓ చానల్‌ను ప్రారంభించారు. భారతీయత గురించి ఆ చానల్‌లో వివరిస్తుంటారు. హిందూ ధర్మాన్ని బోధిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో సెలబ్రిటీని ఆహ్వానించి, వాళ్ల ప్రశ్నలకు స్వామీజీ సమాధాలిస్తారు. ఇలా ఒక ఎపిసోడ్‌కు యాంకర్ సుమ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా సుమ అడిగిన ప్రశ్నలకు పరిపూర్ణానంద స్వామి సమాధానమిస్తూ.. 'అసలు బేసిక్‌గా స్వామీజీలకు రాజకీయాలెందుకు? అనేవాళ్లు ఎవరంటే.. రాజకీయనాయకులే. స్వామీజీలు రాజకీయాల్లోకి వస్తే తమ పని అయిపోతుందని భయపడుతున్నారేమో! బేసిక్‌గా రాజకీయనాయకులకు భార్య, పిల్లలు, వాళ్ల మనవళ్లు, వాళ్ల తల్లిదండ్రులు, వాళ్లకున్న వ్యాపారమో, ఉద్యోగమో.. ఇంకొకటో.. ఇవన్నీ చక్కబెట్టుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలంటే చాలా కష్టంమన్నారు.
 
ఇపుడు ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. మోడీ గారు ఉన్నారు.. ఆయనెవరు? సన్యాసి. ఈ రోజు మోడీగారు రాజకీయాల నుంచి బయటకు వచ్చారనుకోండి.. ఆయనకు ఒక ఇల్లు లేదు. ఆయనకు భార్య, పిల్లలు లేరు. ఆయనకు ఏవీ లేవు. ఆయన ఏం చేస్తారో తెల్సా? నేను చెప్తున్నాను మీకు.. ఆయన రాజకీయాల్లోంచి బయటకు వచ్చారనుకోండి హాయిగా.. మళ్లీ భుజాన ఒక బ్యాగ్ వేసుకుంటారు.. కుదిరితే ఫుల్‌టైమర్‌గా మళ్లీ ఆర్ఎస్ఎస్‌లోకి వెళ్లి సంఘ ప్రచారం చేసుకుంటారు. లేదా ఆయను కాషాయం ఇష్టమనుకోండి శుభ్రంగా వెళ్లి రుషికేష్‌లో తపస్సు చేసుకుంటారు.
 
అలా ఏ రాజకీయనాయకుడైనా చేయగలడా?.. చేయలేరు. ఎందుకంటే వాళ్లకు వెనకాల చాలా బాధ్యతలున్నాయి. నా అభిప్రాయం ప్రకారం రాజకీయాల్లోకి ఎవరైనా రావాలంటే.. ఏ బాదరబందీ లేనివాడు వస్తే ఖచ్చితంగా ఎంతో కొంత చేస్తాడు. ఏదో ఒక ప్రక్షాళన చేయాలనే ఫీలింగ్ కలుగుతుంది' అని పరిపూర్ణానందం చెప్పుకొచ్చారు. అలాగే, పశువుల విక్రయాలపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని ఆయన సమర్థించారు. కేంద్రం చాలా మంచి నిర్ణయం తీసుకుందని, దీనివల్ల దేశంలో పశుసంపద పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలపాయ్ వ్యాఖ్యలను ఆరోజు ఒక్క మీడియా ప్రశ్నించలేదు ఎందుకని: నటి హేమ