Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలాంటి ఇల్లు కట్టాలి.. అఫైర్లు అలవాటైపోయాయి: అనసూయ

యాంకర్ అనసూయ మంచి పేరు సంపాదించేందుకు ఇంకా కష్టపడాలని అంటోంది. ఓ పెద్ద ఇల్లు కట్టుకుని.. ఆ ఇంట ఫామ్ హౌస్ తరహాలో కూరగాయలు పండిస్తూ.. వాటిని వండుకుని తినాలని అనసూయ కలలు కంటుందట. ఈ కలను సాధించడం కోసం ఎంత

Advertiesment
అలాంటి ఇల్లు కట్టాలి.. అఫైర్లు అలవాటైపోయాయి: అనసూయ
, సోమవారం, 22 మే 2017 (17:20 IST)
యాంకర్ అనసూయ మంచి పేరు సంపాదించేందుకు ఇంకా కష్టపడాలని అంటోంది. ఓ పెద్ద ఇల్లు కట్టుకుని.. ఆ ఇంట ఫామ్ హౌస్ తరహాలో కూరగాయలు పండిస్తూ.. వాటిని వండుకుని తినాలని అనసూయ కలలు కంటుందట. ఈ కలను సాధించడం కోసం ఎంతో కష్టపడుతున్నానని అనసూయ చెప్తోంది. న్యూస్ రీడర్ నుంచి సినీ నటిగా ఎదిగిన అనసూయ.. యాంకరింగ్, యాక్టింగ్ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 
 
జబర్ధస్త్ అనే ఒక కార్యక్రమంతో ఫ్యాన్స్‌కు బాగా చేరువైన అనసూయ.. ఈ స్థాయికి చేరుకునేందుకు చాలా కష్టపడ్డానని చెప్తోంది. ఇందుకు తనకు పూర్తి మద్దతు తన కుటుంబం నుంచి వచ్చిందని చెప్తోంది. ఐటమ్ సాంగ్స్, సినీ ఆఫర్లు పిచ్చిపిచ్చిగా వచ్చినా.. కీలక రోల్స్ గల పాత్రల్నే ఎంచుకున్నట్లు వెల్లడించింది. భర్తకు తొలుత ఇండస్ట్రీ నచ్చకపోయినా.. ఆయనను ఒప్పించి.. తల్లి అయినప్పటికీ గ్లామర్ ఫీల్డులో ఉన్నత స్థాయికి ఎదిగింది.
 
ఇక అఫైర్ల గురించి పెద్దగా పట్టించుకోనని.. చాలా నిజాయితీగా తన పని తాను చేసుకుపోతున్నానని వెల్లడించింది. తన మీద వస్తున్న పుకార్ల గురించి మొదట్లో బాధపడేదాన్నని.. అయితే రాను రాను అఫైర్ల వార్తలన్నీ అలవాటైపోయాయని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అమ్మాయిలు హానికరం కాదుకానీ.. పక్కలోకి పనికొస్తారు' : చలపతి రావు వెకిలి కూతలు