Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మాయిని ఐటమ్‌లా చూడకండి.. నేను ఐటమ్ సాంగ్ కాదు.. స్పెషల్ సాంగ్ చేస్తున్నా: అనసూయ

సాయిధరమ్ తేజ్ సినిమాలో అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ పాటపై భారీ అంచనాలున్నాయి. ఈ పాటలో అమ్మడు అందాలను ఆరబోయనుందని టాక్ వస్తోంది. సాయిధరమ్ తేజ్ సినిమా విన్నర్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజైంది. ల‌క

అమ్మాయిని ఐటమ్‌లా చూడకండి.. నేను ఐటమ్ సాంగ్ కాదు.. స్పెషల్ సాంగ్ చేస్తున్నా: అనసూయ
, మంగళవారం, 29 నవంబరు 2016 (15:14 IST)
సాయిధరమ్ తేజ్ సినిమాలో అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ పాటపై భారీ అంచనాలున్నాయి. ఈ పాటలో అమ్మడు అందాలను ఆరబోయనుందని టాక్ వస్తోంది. సాయిధరమ్ తేజ్ సినిమా విన్నర్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజైంది. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, బేబి భ‌వ్య సమర్పణలో... న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 
 
గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో అనసూయకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అయితే అప్పట్లో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఆసక్తి చూపని అనసూయ.. సాయిధరమ్‌తో స్టెప్పులేసేందుకు ఓకే చెప్పింది. ఈ పాట కోసం అనసూయ 12 కేజీలు బరువు తగ్గిందట.

సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ స్పెషల్ సాంగ్‌లో అందంగా కనిపించేందుకు అనసూయ స్పెషల్ కేర్ తీసుకుందని.. మాస్ ప్రేక్షకులకు తన పాట ద్వారా బిగ్ ట్రీట్ ఇవ్వనుందని టాక్ వస్తోంది. ఈ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. అనసూయ భారీ పారితోషికం తీసుకుని నటించిన ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు హైలైట్‌ గా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. 
 
అయితే విన్నర్లో ఐటమ్ సాంగ్ చేస్తున్నావా? అని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు అనసూయ క్లాజ్ తీసుకుంది. ఐటమ్ సాంగ్ అని చెప్పకండి.. అది స్పెషల్ సాంగ్ అని చెప్పింది. ఐటమ్ అంటే అర్థం తెలుసా? ఐటమ్ అంటే ఓ వస్తువు. తనకు ఛాన్స్ దొరికితే క్లాజ్ పీకుతానంటూ.. అమ్మాయిని ఐటమ్ లాగా చూస్తారని అప్పట్లో లాంగ్వేజ్‌లు రానివారు అలా పిలిచారు. అమ్మాయి ఐటమ్ కాదు. 
 
విన్నర్లో తాను చేసేది స్పెషల్ సాంగ్. ఆ పాట సినిమాకు స్పెషల్ కావాలి కాబట్టి.. తాను స్పెషల్ సాంగ్‌కు స్టెప్పులేయడం జరిగిందని చెప్పారు. మోడల్ అయినా నటీమణి కాకపోయినా.. మీకోసం వచ్చి డ్యాన్స్ చేసి ఎంటర్‌టైన్ చేసే అమ్మాయి ఐటమ్ కాదని, ఆమె కూడా ఓ మహిళ అని హితవు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోబో 2.0 కోసం దేశాన్నే క్రియేట్ చేస్తున్న శంకర్.. రజనీకాంత్ కోసమే ఇదంతా?