మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. అమితాబ్

మంగళవారం, 14 జులై 2020 (10:13 IST)
కరోనా మహమ్మారి దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కరోనా అంటేనే జనం వణికిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆయన తనయుడు అభిషేక్, కోడలు ఐష్‌, మనవరాలు ఆరాధ్య కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అభిషేక్, అమితాబ్ నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఐష్‌, ఆరాధ్య ఇంటివద్దే జాగ్రతలు తీసుకుంటూ మందులు వాడుతున్నారు.
 
75 ఏళ్ళ అమితాబ్‌కి కాలేయ, ఉదర సంబంధిత వ్యాధులు ఉండగా, ఆయన ఆరోగ్యంపై అభిమానులలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బిగ్ బీ ప్రతి రోజు తన హెల్త్ అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు. అమితాబ్ క్షేమంగా తిరిగి రావాలని మనదేశంలోనే కాదు విదేశానికి చెందిన అభిమానులు, ప్రముఖులు కూడా ప్రార్ధిస్తున్నారు. కొందరు యాగాలు చేస్తున్నారు. 
 
తనపై ఇంత ప్రేమని కురిపించడం చూసి బిగ్ బీ ఎమోషనల్ అవుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నమస్కరిస్తున్న ఫోటో ఒకటి పెట్టి పోస్ట్ పెట్టారు. ఇందులో మీ ప్రార్ధనలు, శుభాకాంక్షలకి నా ధన్యవాదాలు.. మీ కుండపోత ప్రేమకు మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అమితాబ్ కామెంట్స్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అనసూయ, సుమ ఆ నిర్ణయం తీసుకున్నారట...!?