ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంకు తెలుగు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హరిహర వీరమల్లు ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. దీన్ని పురస్కరించుకుని సోమవారం చిత్రం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది.
ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సగటు భారతీయుడు మొగల్ కాలంలో అనుభవించిన బాధను ఈ సినిమాలో క్యాప్చర్ చేసినట్టు చెప్పారు. తర్వాత సినిమాలు చేస్తానో లేదో తనకు తెలియదన్నారు. నిర్మాత రత్నంగారి కోసమే బెస్ట్ ఇచ్చానని, ముఖ్యమంత్రికి కూడా రత్నం గారిని ఫిలిం డెవలెప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా ప్రతిపాదించినట్టు తెలిపారు.
రత్నం వంటివారు ఇండస్ట్రీకి ఎంతో అవసరమన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు మంచి జరగాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. రత్నం ఆ పదవిని పొందుతారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఎందుకుంటే అన్నీ నా చేతుల్లో ఉండవని, కేవలం ప్రతిపాదన మాత్రమే చేయగలనని చెప్పారు.
తాను వచ్చిన కొత్తల్లో జ్యోతిచిత్ర, సితార ముఖ పేజీలో తన ఫోటోలు వేసేవారు కాదు.. సేలబుల్ కాదనేవారని గుర్తుచేశారు. అలా నాకు తొలి నుంచి సినిమాల ప్రమోషన్ లేకుండానే రిలీజ్ అయ్యాయని, తనకు తన సినిమా కథ ప్రభావం చూపాలి. అలాంటి ఎనర్జీ ఈ సినిమా ఇస్తుందని నమ్ముతున్నట్టు పవన్ చెప్పుకొచ్చారు.