Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"బడ్డీ" క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది - హీరో అల్లు శిరీష్

Buddy

డీవీ

, గురువారం, 1 ఆగస్టు 2024 (23:06 IST)
Buddy
అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. 
 
నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను తెలిపారు హీరో అల్లు శిరీష్.
 
* "బడ్డీ" మూవీని లాస్ట్ ఇయర్ మార్చిలో మొదలుపెట్టి జూలైలో సినిమా కంప్లీట్ చేశాం. డిసెంబర్‌లోనే రిలీజ్‌కు తీసుకురావాలని అనుకున్నాం. నా మూవీస్‌కు గ్యాప్ వస్తోంది. ఫాస్ట్‌గా చేసి డిసెంబర్ 31 సక్సెస్ పార్టీ చేసుకోవాలని నేనూ నిర్మాత జ్ఞానవేల్ గారూ అనుకున్నాం. అయితే ఈ సినిమాలో 3 వేలకు పైగా సీజీ షాట్స్ ఉన్నాయి. బడ్డీ ఫేస్‌ను యానిమేట్ చేయాలి. వాటిని పర్పెక్ట్‌గా చేయాలంటే డబ్బుతో పాటు ఆర్టిస్టులకు టైమ్ ఇవ్వాలి. దాంతో లేట్ అయ్యింది. సమ్మర్ అనుకున్నది ఆగస్టుకు పోస్ట్ పోన్ అయ్యింది. బొమ్మకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందనే కీ పాయింట్ మీదే సినిమా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగ్గకుండా సీజీ వచ్చింది.
 
* డైరెక్టర్ శామ్ ఆంటోనీ ఈ కథతో నా దగ్గరకు వచ్చి టెడ్డీ బేర్ పాయింట్‌తో ఉంటుందని చెప్పారు. టెడ్డీ మూవీ తమిళంలో వచ్చింది, అలాగే ఇంగ్లీష్ లోనూ ఇలాంటి సినిమా ఉందని చెప్పాను. మీరు కథ వినండి మీకు కొత్తగా అనిపిస్తుంది. స్టోరీ విన్నాక మల్లీ ఓటీటీలో టెడ్డీ మూవీ చూడండి అన్నారు శామ్ ఆంటోనీ. అలా కథ విన్నాను. టెడ్డీ బేర్‌కు ప్రాణం రావడం అనే ఒక్క పాయింట్‌ను మాత్రమే దర్శకుడు టెడ్డీ సినిమా నుంచి తీసుకున్నాడు. మిగతాదంతా కొత్త కథ. హీరోయిన్‌కు విలన్ కు ఉండే కాన్ ఫ్లిక్ట్, హీరో క్యారెక్టరైజేషన్, కథకు ఇచ్చిన జస్టిఫికేషన్స్ అన్నీ బాగా స్క్రిప్టింగ్ చేశాడు. "బడ్డీ"  కథ వింటునప్పుడు కొత్తగా అనిపించింది. నేనూ రోజు కథలు వింటా... ఒక వెరైటీ పాయింట్ ఏ కథలో దొరుకుతుందా అని వెతుకుతుంటా. ఆ కొత్తదనం "బడ్డీ" కథలో ఫీల్ అయ్యా. నేను ఫస్ట్ టైమ్ పైలట్‌గా కనిపించబోతున్నా. నా క్యారెక్టర్ ఇంటెన్స్‌గా ఉంటుంది.
 
* "బడ్డీ" పోస్టర్ రిలీజ్ నుంచి ఇది రీమేక్ కదా అని కామెంట్స్ వచ్చాయి కాదు స్ట్రైట్ ఫిల్మ్ అని చెప్పడమే మాకు పెద్ద సవాల్‌గా మారింది. ఎంత చెప్పినా ఇది రీమేక్ అనే కామెంట్స్ రాసేవారు. అలాంటి వాళ్లను మనం మార్చలేం, వారికి మొత్తం సినిమా చూపెట్టి ప్రూవ్ చేయలేం కదా. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్లకే తెలుస్తుంది "బడ్డీ" స్ట్రైట్ ఫిలిం అని. "బడ్డీ" క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది.
 
* తెలుగు ఆడియెన్స్ మూవీ లవర్స్. వాళ్లు ఇప్పటికీ థియేటర్స్ లోనే సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అందుకే మన దగ్గర థియేటర్స్‌లో పుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. సింగిల్ స్క్రీన్స్ లోనూ బాగా సినిమాలు చూస్తుంటారు. అదే నార్త్‌లో అలా ఉండదు. వాళ్ల జనాభాకు థియేటర్స్‌కు వెళ్లే వారి సంఖ్య చూస్తే చాలా తక్కువ. సెకండ్ వీక్ సినిమాకు వెళ్తామనే ఫ్రెండ్స్‌ను చూశాను. అందుకే అందరికీ అందుబాటు ధరల్లో మా "బడ్డీ"  సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం.
 
* "బడ్డీ"లో లవ్ స్టోరీ ఉంటుంది కానీ చాలా తక్కువ పార్ట్ ఉంటుంది. కథకు ఎంత కావాలో అంతే ఉంచాడు దర్శకుడు శామ్. లవ్ స్టోరీ ఎక్కువ ఉంటే కథ డీవీయేట్ అవుతుందని ఆయన భావించాడు. "బడ్డీ"  సినిమా రన్ టైమ్ కూడా చాలా క్రిస్ప్‌గా ఉంటుంది. 2 గంటల 8 నిమిషాలు రన్ టైమ్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌కు ఎక్కువ లెంగ్త్ ఉంటే బాగుండదు. అలా మ్యాజిక్ చేస్తున్నట్లు కథ ఫాస్ట్‌గా వెళ్లాలి.  "బడ్డీ" కి డైరెక్టర్ శామ్ అదే ప్రయత్నం చేశాడు.
 
"బడ్డీ"లో నాలుగు మేజర్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. వాటిని చాలా న్యాచురల్‌గా ఉండేలా డిజైన్ చేయమని మా యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌కు చెప్పాను. నేను చెప్పే ముందే వాళ్లే ఇలా న్యాచురల్‌గా చేద్దాం సార్ అన్నారు. నేను సర్ ప్రైజ్ అయ్యాం. మా అందరికీ ఒకేలా ఆలోచిస్తున్నాం అనిపించింది.
 
ప్రొడక్షన్ పరంగా మూవీ చాలా రిచ్‌గా ఉంటుంది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారు సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. ఒక పాత విమానం కొని దాన్ని మూవీ కోసం ఆర్ట్ వర్క్ చేసి అందులో షూట్ చేశాం. క్లైమాక్స్ ఫైట్ కూడా అందులోనే ఉంటుంది. సినిమాకు కావాల్సింది ఇస్తాను కానీ తక్కువ డేస్‌లో షూటింగ్ చేయండని ప్రొడ్యూసర్ చెప్పేవారు. రెండు షిఫ్టుల్లో సినిమాను కంప్లీట్ చేశాం.
 
హిప్ హాప్ తమిళ చేసిన మ్యూజిక్, బీజీఎం అదిరిపోతుంది. మేము "బడ్డీ"  చూసినప్పుడు బీజీఎం సూపర్బ్‌గా ఉందనిపించింది. స్పెషల్ షోస్ వేసినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిప్ హాప్ థమిళ చేసిన తని ఓరువన్, ధృవ లాంటి మూవీస్ పాటలు నాకు ఇష్టం.
 
అలీ గారితో నేను గతంలో శ్రీరస్తు శుభమస్తు సినిమా చేశాను. ఈ సినిమాలో మరోసారి కలిసి నటించాను. అలాంటి సీనియర్ యాక్టర్‌తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో కో పైలట్ క్యారెక్టర్‌లో అలీ గారు కనిపిస్తారు.
 
ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడాన్ని ఇష్టపడను. ఒక సినిమా తర్వాతే మరొకటి. అందుకే నా మూవీస్ లేట్ అవుతున్నాయి. సాధారణంగా చిన్నా, పెద్దా ఏ సినిమా అయినా అనుకున్న టైమ్ కు చేయలేం. ఖచ్చితంగా ఎంతో కొంత ఆలస్యమవుతూనే ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత సిటాడెల్ యాక్షన్ మోడ్ టీజర్ (video)