Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయాన్‌తో అల్లు అర్జున్.. ఫేస్‌బుక్‌లో ఫోటో.. 12 గంటల్లోనే లక్షా యాభైవేల లైక్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా 'దువ్వాడ జగన్నాథమ్‌'(డీజే) చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియే

Advertiesment
Allu arjun with ayaan latest photo in facebook
, ఆదివారం, 16 అక్టోబరు 2016 (14:54 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా 'దువ్వాడ జగన్నాథమ్‌'(డీజే) చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఫేస్‌బుక్‌లో ఒక చూడచక్కని ఫోటోను షేర్ చేశారు. బన్నీ తన బుల్లి వారసులు అల్లు అయాన్‌ను ముద్దుగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని చాలా సంతోషంగా అందులో కనిపించారు. 
 
మరి ఇంత చక్కటి ఫొటోను తమ అభిమాన నటుడు షేర్‌ చేశాక అభిమానులు ఆగుతారా... వరుసబెట్టి కామెంట్స్‌, లైక్స్‌తో తమ భావాల్ని బయటపెట్టారు. బన్నీ తన ఫేస్‌బుక్‌లో ఫొటోను షేర్‌ చేసిన 12 గంటల్లోనే లక్ష యాభైవేల మంది లైక్‌ చేశారు, 463 మంది కామెంట్స్‌ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంతకు దసరా గిఫ్ట్: ఏమిచ్చాడో తెలుసా? పెళ్ళి డేట్ ఫిక్స్ అయ్యేలోపు..?