Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు అర్జున్ ప్రమోషన్స్ మిగతా హీరోల కంటే విభిన్నంగా కనిపిస్తుంటాయి.

Advertiesment
bunny met fan boy

ఠాగూర్

, గురువారం, 17 అక్టోబరు 2024 (14:56 IST)
బన్నీ సినిమా నుంచి వెలువడే రెగ్యులర్ అప్డెట్స్‌తో పాటు, అభిమానులతో అతను నడుచుకునే తీరు హైలైట్‌‌గా అప్పుడప్పుడు కొన్ని వీడియోల విడుదలవుతూ ఉంటాయి. గతంలో "పుష్ప" సినిమా రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్‌ను చూసేందుకు ఓ అభిమాని కాలినడకన 250 కిలోమీటర్లు నడిచినట్లు ఓ వార్త వచ్చింది. 
 
గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన పి.నాగేశ్వరరావు అనే యువకుడు అల్లు అర్జున్‌ను కలవాలని మాచర్ల నుంచి హైదరాబాద్‌కు కాలినడకన అల్లు అర్జున్ ప్లకార్డుతో వచ్చి కనిపించాడు. అప్పుడు బన్నీ అతన్ని కలిసిన వీడియో విడుదల చేశారు. మరలా ఇప్పుడు "పుష్ప 2"  సినిమా విడుదలకు ముందు.. యూపీ నుంచి ఓ అభిమాని సైకిల్ మీద 1750 కిమీ వచ్చినట్లు.. బన్నీ అతన్ని కలిసినట్లు మరో వీడియో రిలీజ్ అయింది. 
 
అభిమాన హీరోలను కలవాలని అందరికీ ఉంటుంది కానీ..‌ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం నడుస్తూ.. సైకిల్ తొక్కుతూ వచ్చి మొత్తానికి తమ‌ హీరోనూ కలవగలిగారు. ఫ్యాన్స్ ఎమోషనో.. పర్సనల్ ప్రమోషనో కానీ మొత్తానికి అల్లు అర్జున్ నుంచే ఈ తరహా కంటెంట్ వస్తూ ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరోయిన్ సమంత (Video)