Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును చేరుకున్న బన్నీ

Advertiesment
సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును చేరుకున్న బన్నీ
, బుధవారం, 26 మే 2021 (10:02 IST)
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా కష్టకాలంలోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. తాజాగా బ‌న్నీ సోష‌ల్ మీడియాలో స‌రికొత్త మైల్ స్టోన్ చేరుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే అల్లు అర్జున్ తాజాగా 12 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకున్నాడు.
 
గత కొంతకాలంగా అల్లు అర్జున్ ప్ర‌భంజ‌నానికి రికార్డులు చెరిగిపోతున్న విషయం తెల్సిందే. ఇటు సినిమాలైతే ఏంటి, అటు సోష‌ల్ మీడియా అయితే ఏంటి బ‌న్నీ పాత రికార్డుల‌ని చెరిపేసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తున్నారు. 
 
గ‌త ఏడాది ''అల వైకుంఠ‌పురుం"లో సినిమాతో కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. ఇప్ప‌టికీ ఈ సినిమాకు సంబంధించిన రికార్డుల హోరు న‌డుస్తుంది. తాజాగా బ‌న్నీ సోష‌ల్ మీడియాలో స‌రికొత్త మైల్ స్టోన్ చేరుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే అల్లు అర్జున్ తాజాగా 12 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకున్నాడు. 
 
ఇంత ఫాస్ట్‌గా ఆ మార్క్ సెట్ చేసిన సౌత్ ఇండియ‌న్ మ‌రియు తెలుగు హీరోగా బ‌న్నీ నిలిచాడు. గ‌త కొద్ది రోజుల క్రితం విజ‌య్ దేవర‌కొండ కూడా ఈ ఫీట్‌ని అందుకున్నాడు. కాగా, బ‌న్నీ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డ‌గా, ఆయ‌నకు అభిమానులు, సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని విషెస్ అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగం సిరీస్ సూర్యకే చెల్లింది.. ఆగస్టులో Singham 4.. స్వీటీ ఎంట్రీ!?