మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలను వేధించే వారు ఎక్కువైపోతున్నారు. సాధారణ మహిళల నుంచి సెలెబ్రిటీల వరకు వేధింపులు ఎదుర్కొన్న వారు చాలామంది వున్నారు. అలా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సీనియర్ నటి రజిత అలీతో సరదాగా షో వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. ట్రైన్ ప్రయాణం ఎందుకు అంత భయం అంటూ అలీ అడగ్గా రజిత అసలు విషయంచెప్పారు.
ఓసారి ట్రైన్‌లో ప్రయాణం చేస్తుండగా.. బాత్రూం నుంచి బయటకు వచ్చాను.. అక్కడ ఓ వ్యక్తి నన్ను పట్టుకుని కౌగిలించుకుని, ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ట్రైన్‌లో అరిచినా కూడా వినబడలేదు. అప్పటి నుంచి రైళ్లో ప్రయాణించాలంటే భయం అని అసలు సంగతిని చెప్పేశారు.