Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్‌బాస్ షోలో విస్కీ కావాలంటూ ఆదర్శ్ కేకలు.. ధన్‍‌రాజ్‌పై దాడి..

కోలీవుడ్‌లో లెజెండ్ సినీ నటుడు కమల్ హాసన్ బిగ్ బాస్ సంచలనమవుతున్న తరుణంలో, తెలుగులోనూ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసే బిగ్ బాస్ కూడా క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇప్పుడిప్పుడే ఈ షోకు క్రేజ్ మెల్లమెల్లగా వస్

Advertiesment
బిగ్‌బాస్ షోలో విస్కీ కావాలంటూ ఆదర్శ్ కేకలు.. ధన్‍‌రాజ్‌పై దాడి..
, గురువారం, 20 జులై 2017 (16:45 IST)
కోలీవుడ్‌లో లెజెండ్ సినీ నటుడు కమల్ హాసన్ బిగ్ బాస్ సంచలనమవుతున్న తరుణంలో, తెలుగులోనూ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసే బిగ్ బాస్ కూడా క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇప్పుడిప్పుడే ఈ షోకు క్రేజ్ మెల్లమెల్లగా వస్తోంది. హైప్ కోసం షో నిర్వాహకులు కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. అందులో ఒకటే ఆదర్శ్ వ్యవహారం అంటున్నారు... సినీ జనం. 
 
ఇంతకీ బిగ్ బాస్ మూడో ఎపిసోడ్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. గత వారాంతంలో ప్రారంభమై, తెలుగు టీవీ ప్రేక్షకులకు మూడు రోజుల్లోనే దగ్గరైన వినూత్న 'బిగ్ బాస్' షోలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన ఆదర్శ్ మందు, మత్తు లేక పిచ్చెత్తినట్టు ప్రవర్తించాడు. అసలే డ్రగ్స్ వ్యహారం కోలీవుడ్‌ను షేక్ చేస్తుంటే.. ఆదర్శ్ పిచ్చి ప్రవర్తన ప్రస్తుతం టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యింది. 
 
విస్కీ కావాలని ఆదర్శ్ పెద్దగా అరవడం.. అతడిని అదుపు చేయాలని చూసి మధుప్రియ, సమీర్ తదితరులపై దాడికి దిగాడు. ఈ క్రమంలో ధనరాజ్ అతని వద్దకు వెళ్లగా, చెయ్యిని రక్తం వచ్చేలా కొరికేశాడు. ఆ తరువాత కాసేపటికి తనంతట తాను ఏడ్చాడు. ధనరాజ్‌కు క్షమాపణలు చెప్పాడు. ఆపై ప్రిన్స్‌తో కలసి లోపలికి వెళ్లాడు. కాసేపటికి బయటకు వచ్చి వస్తువులను విసిరి విసిరి పడేస్తూ, మిగతా వారిని బెంబేలెత్తించాడు. ఈ ఎపిసోడ్‌పై షో నిర్వాహకులు సస్పెన్స్ పెడుతూ వీడియో విడుదల చేశారు. దీంతో షోపై ఆసక్తి పెంచుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సిల్లీ పాయింట్ పైన కత్రినా కైఫ్ వెరీ యాంగ్రీ... చెబితే నవ్వుకుంటారు...