Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

40 మందికి నోటీసులు.. పేర్లు వెల్లడించవద్దని బెదిరింపులు.. అకున్ కామెంట్స్

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో మరో 40 మందికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే, వీరి పేర్లు మాత్రం వెల్లడించవద్దని తనపై తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున

40 మందికి నోటీసులు.. పేర్లు వెల్లడించవద్దని బెదిరింపులు.. అకున్ కామెంట్స్
, ఆదివారం, 30 జులై 2017 (11:34 IST)
హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో మరో 40 మందికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే, వీరి పేర్లు మాత్రం వెల్లడించవద్దని తనపై తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... తాము విచారిస్తున్న డ్రగ్స్ కేసులో బయటపడుతున్న సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించవద్దని ఒత్తిడి, బెదిరింపులు వస్తున్నాయన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నానని అన్నారు. 
 
ఈ కేసులో సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తల పిల్లలు, కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఎవరినీ వదలవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి నుంచి తనకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. డ్రగ్స్ వాడినా కూడా జైలు శిక్ష ఉంటుందని, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. 
 
డ్రగ్స్‌ వాడితే కూడా ఆరు నెలల నుంచి 3 సంవత్సరాల జైలుశిక్ష ఉంటుందని హెచ్చరించారు. రామకృష్ణమఠం వల్ల మానసిక ప్రశాంతత, సంతోషం, శాంతి పొందానని అన్నారు. మాదకద్రవ్యాలు లేని రాష్ట్ర నిర్మాణమే లక్ష్యంగా సాగుతున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా హైదరాబాద్‌ను 99 శాతం డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు కృషిచేస్తున్నట్టు తెలిపారు. అలాగే, సిగరెట్‌, మద్యం అమ్మకాలను నియంత్రించగలం గానీ, దుకాణాలను మూసివేసే అధికారం తమకు లేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే డ్రగ్స్ వాడాల్సిందే.. హీరోకు చెప్పిన దర్శకుడు...