‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ హీరో పాటించే హెల్త్ టిప్స్...
బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన ఫిట్నెస్‌కు అద్దంలాంటి వాడు. కండలు తిరిగిన దేహంతో ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షిస్తాడు. ఆ అగ్రహీరో నటించిన సినిమా ఇటీవలే విడుదలై చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన ఫిట్నెస్‌కు అద్దంలాంటి వాడు. కండలు తిరిగిన దేహంతో ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షిస్తాడు. ఆ అగ్రహీరో నటించిన సినిమా ఇటీవలే విడుదలై చర్చనీయాంశంగా మారింది.
ఆయన నటించిన నూతన చిత్రం పేరు ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’. అక్షయ్ ఫిట్‌గా ఉండేందుకు పలు ఆరోగ్య సూత్రాలను తూచా తప్పకుండా అనుసరిస్తుంటాడు. ఇటీవల తన హెల్త్ సీక్రెట్స్ గురించి ఒక వీడియోను సైతం విడుదల చేసి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాడు.
ఈ అక్షయ్ కుమార్ పాటించే హెల్త్ టిప్స్ ఓసారి పరిశీలిస్తే...
* క్రమం తప్పకుండా ప్రతీరోజూ ఉదయం 4.30 నిముషాలకు నిద్ర లేస్తాడు.
* గంటసేపు స్విమ్మింగ్.
* గంటపాటు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.
* రెగ్యులర్‌గా యోగా, స్ట్రచ్చింగ్ ఎక్సర్‌సైజులు.
* ఒక గంటపాటు మెడిటేషన్.
* బ్రేక్ ఫాస్ట్‌లో పరోఠా, ఒక గ్లాసు పాలు.
* లంచ్‌లో రోటీ, పప్పు, పచ్చని ఆకుకూరలతో చేసిన కూర, చికెన్, ఒక కప్పు పెరుగు.
* డిన్నర్‌లో లైట్‌ఫుడ్ అంటే వెజిటబుల్ సూప్, సలాడ్, పచ్చి ఆకుకూరలతో చేసిన వంటకాలు.
అలాగే, ఇతరులు పాటించాల్సిన టిప్స్‌పై ఆయన ప్రచారం చేస్తున్నారు.
* ప్రతీరోజూ అర్థగంట వాకింగ్, జిమ్, యోగా లేదా డాన్స్ చేయాలి.
* తీపి పదార్థాలను, ఉప్పును సాధ్యమైనంత మేర తగ్గించాలి. ఇలా చేయడం ఇబ్బందిగా అనిపిస్తే క్రమంగా వాటిని తగ్గిస్తూ రావాలి.
* వేయించిన, మసాలతో కూడిన ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదు.
* డైట్‌లో పచ్చని ఆకుకూరలు, సలాడ్లను మిగిలిన ఆహార పదార్థాల కన్నాఅధికంగా తీసుకోండి.
* వయసు 35 సంవత్సరాలుదాటిన తర్వాత సంవత్సరంలో ఒక్కసారి బ్లడ్‌టెస్ట్ తప్పక చేయించండి.