Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత మతం ఎందుకు మార్చుకోవాలి... నాన్నగారు కూర్చోమంటే కూర్చున్నాం... నాగచైతన్య

గత కొన్నిరోజులుగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో అక్కినేని నాగచైతన్య - సమంతల పెళ్లి వ్యవహారం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నాగచైతన్య-సమంత ఇద్దరూ ఏదో ఒక పూజా కార్యక్రమంలో పాల్గొంటే అదేదో ఆమె మతం మార్పిడి కోసం పూజ చేశారంటూ వార

సమంత మతం ఎందుకు మార్చుకోవాలి... నాన్నగారు కూర్చోమంటే కూర్చున్నాం... నాగచైతన్య
, శనివారం, 1 అక్టోబరు 2016 (20:42 IST)
గత కొన్నిరోజులుగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో అక్కినేని నాగచైతన్య - సమంతల పెళ్లి వ్యవహారం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నాగచైతన్య-సమంత ఇద్దరూ ఏదో ఒక పూజా కార్యక్రమంలో పాల్గొంటే అదేదో ఆమె మతం మార్పిడి కోసం పూజ చేశారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు. 
 
సమంత మతం మార్చుకున్నదంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తనకు మతాలతో సంబంధం లేదనీ, మనుషులనే చూస్తానంటూ చెప్పాడు. అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లినప్పుడు నాన్నగారు పూజ చేస్తూ ఉన్నారనీ, ఆయన పూజ ముగియగానే ఎలాగూ మీరు కూడా వచ్చారు కదా పూజ చేయండి అంటే తామిద్దరం కూర్చున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేతప్ప మతం మార్పిడి వ్యవహారం కాదని స్పష్టం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాస్ట్యూమ్స్ త‌గ్గించేసింది... కాల్షీట్స్ పెంచేసింది... అబ్బో రాశీఖ‌న్నా