Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాస్ట్యూమ్స్ త‌గ్గించేసింది... కాల్షీట్స్ పెంచేసింది... అబ్బో రాశీఖ‌న్నా

పొందిక‌గా ఉంటే... సినిమా ఫీల్డులో కుద‌ర‌దు... కాస్త రిలాక్సేష‌న్ ఇస్తే...రెచ్చిపోవ‌చ్చు! అద్భుత‌మైన అవ‌కాశాల్ని కొట్టేయచ్చు. కొద్దిగా ఆల‌స్యం అయినా రాశిఖ‌న్నా ఇదే చేసింది. త‌ను వేసుకునే కాస్ట్యూమ్స్ కాస్త త‌గ్గించేసింది. అది త‌న కాల్షీట్స్ పెంచేసింది

కాస్ట్యూమ్స్ త‌గ్గించేసింది... కాల్షీట్స్ పెంచేసింది... అబ్బో రాశీఖ‌న్నా
, శనివారం, 1 అక్టోబరు 2016 (20:19 IST)
పొందిక‌గా ఉంటే... సినిమా ఫీల్డులో కుద‌ర‌దు... కాస్త రిలాక్సేష‌న్ ఇస్తే...రెచ్చిపోవ‌చ్చు! అద్భుత‌మైన అవ‌కాశాల్ని కొట్టేయచ్చు. కొద్దిగా ఆల‌స్యం అయినా రాశిఖ‌న్నా ఇదే చేసింది. త‌ను వేసుకునే కాస్ట్యూమ్స్ కాస్త త‌గ్గించేసింది. అది త‌న కాల్షీట్స్ పెంచేసింది. సుప్రీం హిట్‌తో వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా మారిపోయింది రాశీఖన్నా. ఇక ‘హైపర్’ సినిమాతో రాశీ రేంజ్ పెరిగిపోతోంది. 
 
కొత్త‌గా గోపించంద్‌తో ఆక్సిజన్ సినిమాతో పాటూ.. రీసెంట్‌గా రవితేజ సినిమాకి కూడా సైన్ చేసింది. కొద్దిరోజుల క్రితమే సిద్దార్ధ సరసన ‘సైతాన్ కా బచ్చా’ అనే తమిళ సినిమాని ఒప్పుకున్న ఈ భామ.. ఇప్పుడు మరో తమిళ ప్రాజెక్ట్ ఒప్పేసుకుంద‌ట‌.
 
హీరో అధర్వా సరసన ‘డిమాంటి కాలనీ’ దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో తెరకెక్కున్న సినిమాకి రాశీ ఖన్నా సైన్ చేసింది. ఈ రెండు సినిమాలతో కోలీవుడ్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి తన రేంజ్‌ని పెంచే పనిలో పడింది రాశిఖ‌న్నా. మ‌రి సినిమా ఫంక్ష‌న్ల‌కు కుర‌చ దుస్తులు వేసుకొస్తే... నిర్మాత‌లు, హీరోలు ఊరుకుంటారా... వ‌రుస‌గా సినిమాల్లో బుక్ చేసేయ‌రూ! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ‌ర‌ల‌క్ష్మి, విశాల్ ఎక్కువకాలం ప్రేమించుకున్నారు... అందుకే...