ఏజెంట్ సినిమా తర్వాత కొంతగేప్ తీసుకున్న అఖిల్ అక్కినేని తాాజాగా కొత్త చేస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఇటీవలే కొంత భాగాన్ని రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు. అనంతరం చిత్తూరులో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంకోసం ఈసారి విదేశాలకు వెళ్ళకుండానే ఇండియాలోనే తీసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది.
కాగా, అఖిల్ సరసన కొత్త అమ్మాయిని అనుకున్నారు. ఇంకోవైపు శ్రీలీలను ఎంపికచేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు లెనిన్ అని పేరు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై రూపొందుతున్న సినిమాకు సుప్రియ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాయలసీ బేక్ డ్రాప్ లో సాగే కథని తెలుస్తుంది. మరి ఈ చిత్రం సరికొత్తగా వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.