శ్రియా భూపాల్ ఇంట పసుపు కొట్టే వేడుకలో ఉపాసన.. మరి అక్కినేని ఇంట సమంత పసుపు కొట్టి?
అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్‌ల పెళ్లికి వేళాయె. ఇటీవల నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో.. పెళ్ళెప్పుడు జరుగుతుందో తెలియదు కానీ శ్రియా భూపాల్ ఫ్యామిలీ మాత్రం పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించేశారు. దీ
అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్‌ల పెళ్లికి వేళాయె. ఇటీవల నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో.. పెళ్ళెప్పుడు జరుగుతుందో తెలియదు కానీ శ్రియా భూపాల్ ఫ్యామిలీ మాత్రం పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించేశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేస్తుంది.
శ్రియా భూపాల్‌తో సహా మిగిలిన మహిళలు పసుపు రంగు దుస్తులు ధరించి పాల్గొన్నారు. కాబోయే అక్కినేని కోడలు లెహంగాలో మెరిశారు. ఇంటిని కూడా పసుపు పచ్చని బంతిపూలతో చక్కగా అలంకరించారు. ముఖ్యంగా ఈ పసుపు కొట్టే వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కోడలు, చెర్రీ భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు.
ఇక డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. జీవీకే మనుమరాలు శ్రియా భూపాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. కాగా అఖిల్- శ్రేయ భూపాల్ ఎంగేజ్ మెంట్‌లోను ఉపాసన సందడి చేసిన సంగతి తెలిసిందే. జీవీకే ఇంట ఇప్పటికే పెళ్లిపనులు అధికారికంగా మొదలైపోగా.. మరికొన్ని రోజుల్లో అక్కినేని ఇంట కూడా సందడి ప్రారంభం కానుంది. ఈ పనుల్లో సమంత పసుపు కొట్టే కార్యక్రమంలో పాల్గొంటుందో లేదో అనేది చూడాలి.