బాలీవుడ్ చిత్రం తానాజి. అజయ్ దేవగణ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గత ఎనిమిది రోజుల్లో ఆ సినిమా రూ.128 కోట్లు వసూల్ చేసింది. తర్వలోనే 200 కోట్ల మైలురాయిని దాటనున్నది.
ప్రస్తుతం సినీ ప్రేక్షకులంతా 'తానాజీ' కోసం ఎగబడుతున్నారని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్‌లో తెలిపారు. సినిమా రిలీజై వారం అయిన సందర్భంగా.. తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సగటును ప్రతి రోజు తానాజీ సినిమా రూ.13 కోట్లు వసూల్ చేసినట్లు అంచనా వేశారు. ఒకవేళ ఇదే రిథమ్‌లో వెళ్తే ఆ సినిమా రూ.200 కోట్లు ఆర్జించిడం ఖాయమే అని ఆదర్శ్ తెలిపారు.
ముఖ్యంగా, తానాజీ చిత్రానికి మహారాష్ట్రలో బ్రహ్మరథం పడుతున్నారు. రూ.వంద కోట్లు ఆర్జించిన సందర్భంగా అజయ్ దేవగన్.. చిత్ర బృందంతో సంబరాలు జరుపుకున్నారు. ఓమ్ రౌత్ ఈ సినిమాకు డైరక్షన్ వహించారు. ఛత్రపతి శివాజీ వద్ద కమాండర్‌గా ఉన్న తానాజీ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఉదయ్ భాన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు.