Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొన్న పీకే, నిన్న దంగల్, నేడు రాకేష్ శర్మ బయోపిక్... అమీర్ నటదాహానికి అంతేలేదా?

బాక్సాఫీసు వద్ద అన్ని రికార్డులను బద్దలు చేసిన స్పోర్ట్సో డ్రామా చిత్రం దంగల్ సినిమాతో బాలివుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నట దాహం తీరినట్లు లేదు. భారత మాజీ మల్లయోధుడు మహావీర్ సింగ్ పొగట్, ఆయన ఇద్దరు కుమార్తెలపై తీసిన దంగల్ సినిమా అమీర్‌‌ని శిఖర స్థాయికి

మొన్న పీకే, నిన్న దంగల్, నేడు రాకేష్ శర్మ బయోపిక్... అమీర్ నటదాహానికి అంతేలేదా?
హైదరాబాద్ , మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (07:33 IST)
బాక్సాఫీసు వద్ద అన్ని రికార్డులను బద్దలు చేసిన స్పోర్ట్సో డ్రామా చిత్రం దంగల్ సినిమాతో బాలివుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నట దాహం తీరినట్లు లేదు. భారత మాజీ మల్లయోధుడు మహావీర్ సింగ్ పొగట్, ఆయన ఇద్దరు కుమార్తెలపై తీసిన దంగల్ సినిమా అమీర్‌‌ని శిఖర స్థాయికి చేర్చింది. మానవీయ కథనం, స్ఫూర్తిదాయకమైన మెలోడ్రామాతో అమీర్ సృష్టించిన దృశ్య కావ్యం దంగల్ విడుదలై రెండు నెలలైనా కాకముందే ఈ విశిష్ట నటుడు మరొక కొత్త వెంచర్‌కి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు.
 
వైవిధ్యానికి పట్టం గట్టే అమీర్ ఖాన్ మరొక భిన్న కథాశంతో ముందుకొస్తున్నాడు. దేశ చరిత్రలో తొలిసారిగా అంతరిక్ష యానం చేసిన భారతీయుడు రాకేష్ శర్మ అరుదైన ఫీట్‌ను అమీర్ సినిమాగా తీయబోతున్నట్లు తెలిసింది. 
 
అసాధ్యమనిపించిన భారీ సవాళ్లకు చిత్రరూపమిచ్చి సుసాధ్యం చేసిన అమీర్ 34 ఏళ్ల క్రితం భారత రోదసీయాత్రికుడు రాకేష్ శర్మ సాధించిన చారిత్రక క్షణాలను పునర్మిర్మించే పనిలో భాగమవుతున్నాడు. 
 
ముంబై మిర్రర్ పత్రిక పేర్కొన్నదాని ప్రకారం సిద్ధార్థ్ రాయ్ కపూర్ కొత్త స్క్రిప్ట్‌తో అమీర్‌ను కలిశాడని తెలుస్తోంది. కొత్తగా ప్రారంభిస్తున్న ఆర్ కె పిల్మ్స్ (రాయ్ కపూర్ ఫిల్మ్స్) కింద తీయనున్న ఈ సినిమా 2018లో విడుదల కానుందని సమాచారం. అయితే సిద్ధార్త్ రాయ్, అమీర్ ఖాన్ ఇరువురూ కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. నాటి ప్రధాని ఇందిరాగాంధీకి, అంతరిక్షం నుంచి రాకేష్ శర్మకి మధ్య జరిగిన ఆ అద్వితీయ సంభాషణను అమీర్ ఈ చిత్రం ద్వారా మళ్లీ వినిపించనున్నారు. రోదసి నుచి మన దేశం ఎలా కనిపిస్తోంది అని ఇందిరాగాంధీ అడిగిన ప్రశ్నకు సారే జహాసే అచ్చా అంటూ రాకేష్ ఇచ్చిన సమాధానం కోట్లమంది భారతీయులను పరవశింపజేసింది. 
 
అమీర్ తాజా చిత్రం దంగల్ 7వ వారానికి 386.9 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది.రాయీస్, కాబ్లి, జోలీ ఎల్ఎల్‌బి వంటి భారీ చిత్రాలు గత రెండు వారాల్లో విడుదలైనప్పటికీ దంగల్ ఇప్పటికీ థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తూనే ఉండటం గమనార్హం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి-2‌లో బాలీవుడ్ బాద్‌షా.. నిజమా, చీఫ్ ట్రిక్స్‌లో భాగమా?