Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడివి శేష్-శృతి హాసన్‌ టైటిల్ డకాయిట్- టైటిల్ టీజర్ విడుదల

Advertiesment
Shruti Haasan
, బుధవారం, 20 డిశెంబరు 2023 (17:57 IST)
Shruti Haasan
అందరినీ ఆకట్టుకున్న విజువల్ అసెట్స్ తో ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీ పెంచిన అడివి శేష్, శ్రుతి హాసన్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా మేకర్స్ ఈ చిత్రం టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ చిత్రానికి 'డకాయిట్' అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టారు.
 
అడివి శేష్, శ్రుతి హాసన్ గన్స్ తో కనిపిస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్, సెన్సేషనల్ టీజర్‌ను షేర్  చేశారు మేకర్స్. ఇందులో హై-ఆక్టేన్ ఫేస్ ఆఫ్ లో తలడుతునట్లు కనిపించారు. ఇది డకాయిట్ ఇంటెన్స్ వరల్డ్ ని ప్రేక్షకులను పరిచయం చేస్తుంది. ఈ మెగా ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.
 
అడివి శేష్-శృతి హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న డకాయిట్ ఇద్దరు మాజీ ప్రేమికుల నేపధ్యంలో సాగే గ్రిప్పింగ్ స్టోరీగా రూపొందుతోంది. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దొంగతనాలు చేయడానికి ఏకం కావాలి. దర్శకుడిగా షానెల్ డియోకు ఇది తొలి చిత్రం.    
 
అడివి శేష్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు ఈ చిత్రం గొప్ప అనుభూతిని పంచుతుంది. ప్రేక్షకులు బిగ్  స్క్రీన్‌పై ఎన్నడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని షానీల్ డియో అద్భుతమైన విజన్ తో రూపొందిస్తున్నారని ప్రశంసించారు. అడివి శేష్, షానీల్ డియో ఈ చిత్రానికి కథ. స్క్రీన్ ప్లే అందించారు.
 
"షానీల్ డియోకు గొప్ప విజన్ వుంది. అందరినీ ఆకట్టుకునే చాలా స్టైలిష్‌ ఎంటర్ టైనర్ ఇది. ఇంటెన్స్ క్యారెక్టర్స్ తో భారతదేశంలోని అరుదైన ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలలో నేపధ్యంలో సరికొత్త అనుభూతిని పంచబోతుంది. 'డకాయిట్' ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటుదని నమ్ముతున్నాను'' అన్నారు అడివి శేష్.
 
2022లో ప్రశంసలు పొందిన 'మేజర్' తర్వాత అడివి శేష్‌కి వరుసగా రెండవ హిందీ చిత్రమిది. డాకాయిట్‌ని "అరుదైన కథ"అని చెప్పిన శ్రుతి హాసన్..ఈ చిత్రంలో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను'' అన్నారు.
 
అడివి శేష్ 'క్షణం', 'గూఢచారి'తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా పనిచేసిన తర్వాత, 'డాకాయిట్ దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి సరైన చిత్రంగా భావిస్తున్నట్లు షానీల్ డియో చెప్పారు.
 
'డకాయిట్ ఇంటెన్స్ ఎమోషన్‌తో కూడిన యాక్షన్ డ్రామా. మా టీజర్ ప్రేక్షకుల కోసం మేము సిద్ధం చేసిన పెద్ద ప్రపంచం తాలూకు చిన్న ప్రివ్యూ మాత్రమే. అడివి శేష్, శ్రుతి హాసన్ గారు లాంటి అత్యుత్తమ నటులతో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ కొలాబరేషన్ అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు
డకాయిట్ తర్వలో ఫ్లోర్స్ పైకి వెళ్ళనుంది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సితారతో ఒక మధురమైన చిత్రాన్ని పంచుకున్న మహేష్ బాబు