కమాండో-2 రిజల్ట్‌తో తేలిపోనున్న అదా శర్మ ఫ్యూచర్
హీరోయిన్ అనే గుర్తింపు ఉందే తప్ప.. వెనుదిరిగి చూసుకుంటే ఆదా శర్మ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదనే చెప్పాలి. తెలుగులో వచ్చిన హార్ట్ ఎటాక్, క్షణం సినిమాలో ఆమె కెరీర్‌లో గుర్తించదగ్గ సినిమాల
హీరోయిన్ అనే గుర్తింపు ఉందే తప్ప.. వెనుదిరిగి చూసుకుంటే ఆదా శర్మ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదనే చెప్పాలి. తెలుగులో వచ్చిన హార్ట్ ఎటాక్, క్షణం సినిమాలో ఆమె కెరీర్‌లో గుర్తించదగ్గ సినిమాలు బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలన్న అమ్మడి ఆశలు ఇంకా నెరవేరలేదు. అయితే అసలు ఆదా శర్మ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో కమాండో-2 రిజల్ట్‌తో తేలిపోతుందని సినీజనం భావిస్తున్నారు.
మార్చి 3న రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమాపై ఆదా ఎన్నో ఆశలు పెట్టుకుంది. సినిమాలో యాక్షన్‌తో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ దుమ్మురేపింది అందాల చిన్నది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే తనకు ఇండస్ట్రీలో మరో అవకాశం వస్తుందని భావిస్తోంది. బాలీవుడ్‌లోనే కాదు.. మళ్లీ దక్షణాదిలో తనకు అవకాశాలు రావాలన్నా ఈ సినిమా రిజల్టే కీలకమని ఆదా ఫిక్స్ అయ్యింది.
యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా గతంలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా.. నోట్లరద్దు కారణంగా అప్పట్లో విడుదల వాయిదా పడింది. దీంతో అమ్మడి టెన్షన్ కూడా పోస్ట్‌పోన్ అయింది. ఇక ఈసారి ఎలాగైనా సినిమా రిలీజ్ కావడం ఖాయం కావడంతో కమాండో-2 తనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని ఆదాశర్మ ఆశగా ఎదురుచూస్తోంది. మొత్తానికి రెండుసార్లు రిలీజ్ వాయిదా పడ్డ ఈ సినిమా ఆదా శర్మ ఆశలను బ్రతికిస్తుందా అన్నది త్వరలోనే తేలిపోనుంది.