డ్రగ్స్ వ్యవహారంపై నోరు విప్పని సమంత.. పెళ్లైన మూడో రోజే షూటింగ్‌కు!
టాలీవుడ్‌ను షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారంపై నోరు విప్పేందుకు అగ్ర హీరోయిన్ సమంత నిరాకరించింది. డ్రగ్స్ అంశంపై అనేకమంది సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్న వేళ... సమంత మాత్రం
టాలీవుడ్‌ను షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారంపై నోరు విప్పేందుకు అగ్ర హీరోయిన్ సమంత నిరాకరించింది. డ్రగ్స్ అంశంపై అనేకమంది సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్న వేళ... సమంత మాత్రం మీడియా డ్రగ్స్ అంశంపై కదిలిస్తే నో కామెంట్ అని చెప్పింది. తన పెళ్లి గురించి మాత్రం చెప్పుకొచ్చింది. అక్కినేని నాగ చైతన్యతో అక్టోబర్ ఆరో తేదీన గోవాలో తన వివాహం జరుగనున్నట్లు వెల్లడించింది.
వరంగల్‌లోని హన్మకొండలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సమంతను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. పెళ్లికి తర్వాత కొద్దినెలల పాటు తాను నటనకు దూరంగా ఉంటానని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. అంతేకాకుండా పెళ్లి అయిన మూడో రోజే షూటింగ్‌లో పాల్గొంటానని స్పష్టం చేసింది.
ఇంకా హనీమూన్ వార్తలపై స్పందిస్తూ.. అక్టోబరు ఆరున మా పెళ్లి వేడుక గోవాలో జరిగేది నిజం. హనీమూన్ ప్రణాళికలాంటిదేమీ లేదు. పెళ్లైన మూడో రోజునే ఇద్దరం షూటింగ్‌లో పాల్గొంటామని చెప్పింది.